MoviesTollywood news in telugu

రంగస్థలం సినిమాలో కుమార్ బాబు ప్రేయసిగా నటించిన ‘ఈమె’ ఎవరో, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా..

RamCharan Rangastalam Movie:సినిమా రంగంలోకి రావాలని అనుకొనే నటీనటులకు అవకాశాలు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వరిస్తాయి. కొంత మందికి ఎంతో పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో వస్తే….మరికొంత మందికి టాలెంట్ తో వస్తాయి. నిజానికి ఇది ఒక్కప్పటి మాట. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చామని చెప్పుతూ ఉంటారు. యూట్యూబ్ ద్వారా ఫెమస్ అయ్యి ఆ తర్వాత సినిమాలోకి వచ్చింది పూజిత. పూజిత ఒక తెలుగు సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. విశాఖపట్నంలో పుట్టిన పూజిత చెన్నయ్ లో పెరిగింది. YOUTUBE లో షార్ట్ ఫిలిమ్స్ బాగా చూసేవారికి పూజిత పరిచయమే.
rangasthalam movie
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూట్యూబ్ లో మంచి పేరు, స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. చెన్నై లో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలుగు బాగా మాట్లాడుతూ అందంగా ఉండే పూజితకు తన ఫ్రెండ్ ద్వారా షార్ట్ ఫిలిం లో నటించే అవకాశం దక్కింది. ఆలా మొదటిసారిగా ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఆ షార్ట్ ఫిలిం పూజితకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టటమే కాకుండా ఎంతో మంది ఫిలిం మేకర్స్ కళ్ళలో పడింది పూజిత.

ఆలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది. దాంతో కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించే అవకాశం కూడా వచ్చింది. ఆలా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న పూజిత గుండెల్లో గోదారి డైరెక్టర్ నాగేంద్ర కళ్ళలో పడింది.

అంతే నారా రోహిత్ సరసన తుంటరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూజిత. సుకుమార్ రంగస్థలం సినిమాలో పద్మ పాత్ర కోసం అమ్మాయిల వేటలో పడ్డాడు. అలాంటి సమయంలోనే సుకుమార్ పరిచయం అనే షార్ట్ ఫిలిం చూసాడు. ఆ షార్ట్ ఫిలిం లో పూజిత నటన,అందానికి ముగ్ధుడు అయ్యి రంగస్థలం సినిమాలో పద్మ పాత్రకు తీసుకున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయిసిగా కనిపించింది.

రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో పూజిత పాత్రకు కూడా మంచి పేరు,గుర్తింపు వచ్చాయి. అంతేకాక ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో పూజిత స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది.