రంగస్థలం సినిమాకి సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

టాలీవుడ్ లో ‘రంగస్థలం’ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూస్తుంటే సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు రంగస్థలం సినిమాకి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే….రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్ ఇంత వరకు పారితోషికం తీసుకోలేదట. సినిమా ప్రారంభం అయినప్పుడు మొదట్లో ఇచ్చిన అడ్వాన్స్ మాత్రమే. అడ్వాన్స్ తప్ప ఏమి ఇవ్వలేదు నిర్మాతలు ఇప్పటివరకు సుకుమార్ కి. అయితే సుకుమార్ మాత్రం ఓవర్సీస్ హక్కులను తనకు వదిలేయమని నిర్మాతలను అడిగాడట. రామ్ చరణ్ కి ఓవర్సీస్ లో మార్కెట్ పెద్దగా లేకపోవటంతో అక్కడి నుండి నిర్మాతలకు పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేదు.

మొదట్లో సినిమా హక్కులను కొనటానికి 9 కోట్లకు వచ్చారు. అయితే పెద్ద సినిమాలు ఈ మధ్య పరాజయం అవటంతో వారు కూడా రంగస్థలం హక్కులను కొనటానికి భయపడ్డారట.

ఈ సమయంలో సుకుమార్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నాడు. US నుంచి రెండు మిలియన్ డాలర్స్ వస్తుందని అనుకుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా మూడున్నర మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

అలాగే మిగతా విదేశాల కలెక్షన్స్ కలిపి రెండు కోట్ల వరకు బిజినెస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సుకుమార్ ఈ సినిమాతో 14 కోట్లు దక్కించున్నట్టు వార్తలు వస్తున్నాయి.