ఏ రాజకీయ నాయకుడు,ప్రభుత్వం చేయని పని పవన్ కళ్యాణ్ చేసారు

రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలలో తనదైన ముద్రను వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాజాగా అయన ఒక కీలక నిర్ణయం తీసుకోని వార్తల్లోకి వచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ మనస్సుకు హ్యాట్సాఫ్ అని చెప్పాలి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతాకం సాధించిన తెలుగుతేజం రాగాల వెంకట రాహుల్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాక కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతాకం సాధించిన తెలుగుతేజం రాగాల వెంకట రాహుల్ కి జనసేన పార్టి తరపున పది లక్షల చెక్ ని ప్రోత్సాహంగా ఇస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్.

రాహుల్ స్వర్ణ పతాకం సాధించి మన మాతృభూమి భారత్ గర్వపడేలా చేసాడని రాహుల్ అద్భుత విజయం పట్ల మేము గర్వపడుతున్నామని జనసేన పార్టి నీకు సెల్యూట్ చేస్తుందని పవన్ ట్వీట్ చేసారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వటంలో పవన్ ముందుంటాడు.