బాబు చిట్టి అంటూ నవ్వించిన శ్రీలక్ష్మి ఇపుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా ఉన్నారో తెలుసా ?

అలనాటి నటీమణి శ్రీలక్ష్మిని చూడగానే ఆటో మెటిక్ గా మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఆమె నవ్వకుండా ఎదుటి వారిని నవ్వించే సత్తా ఆమెకే సొంతం. అయితే శ్రీలక్ష్మి ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించటం లేదు. ఆమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. శ్రీలక్ష్మి సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి అమరనాథ్ 1958 లోనే శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో శ్రీరాముడు పాత్రలో నటించి మెప్పించారు. ఆలా కొన్ని సినిమాల్లో నటించారు. అమరసందేశం అనే సినిమాను నిర్మించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గటంతో పూర్తి స్థాయిలో నిర్మతగా మారి సంపాదించినా డబ్బు అంతా నిర్మాణంలో పెట్టటంతో అక్కడ కలిసి రాక ఉన్నదంతా పోవటంతో శ్రీలక్ష్మి చిన్నవయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

శ్రీలక్ష్మికి మొదట్లో వేషాలు రావటం కష్టం అయ్యేది. వచ్చిన అవి చాల చిన్న వేషాలు. అయినా శ్రీలక్ష్మి వాటిని అందిపుచ్చుకొని సరైన అవకాశం కోసం ఎదురు చేస్తూ ఉండేది. ఆ సమయంలో దర్శకుడు జంధ్యాల శ్రీలక్ష్మిలోని హాస్య రసాన్ని గమనించి నాలుగు స్తంభాలాట సినిమాలో సుత్తివేలు భార్యగా నటించి మెప్పించింది.

ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో శ్రీలక్ష్మి తమ్ముడు శ్రీలక్ష్మి పోషించే పాత్రల విషయంలో అభ్యంతరం పెట్టాడు. ఆ తమ్ముడు ఎవరో కాదు రాజేష్. నాలుగు స్తంభాలాట సినిమాలో ఒక హీరో. హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు.

నాలుగు స్తంభాలాట సినిమా సమయంలోనే శ్రీలక్ష్మి నటిస్తుంటే కాస్త చిరాకు పడేవాడు. ఎందుకంటే ఆడవాళ్లు సినిమాలో నటిస్తే రకరకాల కామెంట్స్ వస్తాయని అంటూ ఉండేవాడు. నీవు వేసేది ఏమైనా హీరోయిన్ వేషమా …చిన్న వేషమే అని ఎద్దేవా చేసేవాడు.

దాంతో శ్రీలక్ష్మి ని పాత్ర నీకు ఎంత ముఖ్యమో నా పాత్ర కూడా అంతే ముఖ్యమని, నాకు అడ్డు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇద్దరు ఒకే సినిమాలో నటించిన పెద్దగా మాట్లాడుకోరు. శ్రీలక్ష్మి ఆలా నటిస్తూ హాస్య పాత్రలు మరోవైపు క్యారెక్టర్ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది.

సుత్తి వీరభద్రరావు,గొల్లపూడి మారుతీరావు,కోట శ్రీనివాసరావు,బ్రహ్మానందం వంటి హాస్యనటులకు జోడిగా నటించి మెప్పించింది. జంధ్యాల దర్శకత్వంలో నటించిన ప్రతి సినిమాలోనూ శ్రీలక్ష్మికి ఒక మేనరిజం ఉండేది. ఆలా ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉంది.

ఇప్పుడు శ్రీలక్ష్మి అంటే టివి సీరియల్స్ లో అడపాదడపా కనిపించే నటి మాత్రమే. ఇప్పుడు శ్రీలక్ష్మికి అవకాశాలు రాకపోవటానికి ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. అంతేకాక శ్రీలక్ష్మి కుటుంబం గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆమె ఆ విషయాలను ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇప్పటి తరం దర్శకులు కూడా శ్రీలక్ష్మికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుందాం.