రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్న మెగాస్టార్…?

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి రాజకీయాలంటేనే అస‌హ్య‌మేస్తోంద‌ట‌. సున్నిత మనస్కుడైన చిరంజీవి ఇప్పటి రాజకీయాలను తట్టుకోలేక పోయారని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. ఫలితంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఆ తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసినా రాజకీయాలలో చురుగ్గా ఉండలేక పోయారు. తాను అనుకుంది ఒకటి. అయింది మరొకటి. ఏపీకి సిఎం అవుతానని కలలు కన్నాడు. జనం ఓట్లేయలేదు. సీన్ రివర్స్ అయింది. అభిమానం వేరు. వాస్తవం వేరు అని తెలిసి వచ్చింది. పవన్ కల్యాణ్ ది దాదాపు అదే రూటు. కాకపోతే పవన్ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలను తిట్టే విషయంలో రకరకాలుగా మారుస్తూ వస్తున్నారు.
Kalyan,Mega Star
కాసేపు చంద్రబాబు పాలన భేష్ అంటాడు. మరికాసేపు అవినీతి పరుడుని ముద్రవేశాడు. ఫలితంగా గుడ్ విల్ దెబ్బతింది. అసలు అతని రాజకీయాలకు పనికిరాడని ఆ పార్టీ నేతలే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి పిలిచి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పదవి ఇస్తానని చెప్పారట.

అందుకు చిరంజీవి సున్నితంగా కాదని చెప్పారట. ఏపి పిసిసి పదవితో పాటు.. కేంద్ర కోర్ కమిటీలో సభ్యత్వం కల్పిస్తారని చెప్పినా కాదన్నారట చిరు. తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడు చిరు.

అదే విషయాన్ని రాహుల్ కు చెప్పారు చిరు. ఫలితంగా చిరు విషయంలో ఇకమీదట ఇబ్బంది పెట్టకూడదని రాహుల్ డిసైడ్ అయ్యారంటారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా… కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఆందోళనలలో చిరంజీవి కనపడలేదు.

అసలు మాట్లాడలేదు. మిగతా కార్యక్రమాల్లోను చిరంజీవి పాల్గొనడం లేదు. చిరంజీవి క్రియాశీలకంగా ఉన్నా లేకున్నా రాబోయే కాలంలో ఆయనతో ప్రచారం చేయించే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అదే జరిగితే పాతాళంలోకి పోయిన కాంగ్రెస్ కొంత పుంజుకునే అవకాశముంది.