వర్మ,లోకేష్ తోలు తీస్తాం…. నిప్పులు చెరిగిన అలీ….!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయన కుమారుడు మంత్రి లోకేష్ లపైనా,తెలుగుదేశం పార్టీ పైన ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో బాంబు పేల్చారు. చంద్రబాబు నాయుడుకు అయన ఒక లేఖ రాస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు తనకు ఇచ్చిన ప్రతిఫలం…. తనపై కుట్రలు,బురద జల్లడం, సచివాలయం వేదికగా చేసుకొని మీడియా సంస్ధలతో కుమ్మక్కయి చేసిన ఉదంతాల అని అయన ప్రశ్నించారు. AP సచివాలయంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ ,అతని స్నేహితుడు రాజేష్, మీడియా సంస్థలు నన్ను ఎదుర్కొనే దమ్ము లేక మా అమ్మను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.

నేను చావటానికి సిద్దమై వచ్చాను….అలాంటిది ఓటమికి భయపడేది లేదు. ఈ యుద్ధంలో నేను చనిపోతే నా పోరాటాన్ని అర్ధం చేసుకోవాలని అభిమానులకు మెసేజ్ ఇవ్వడంపై ఇప్పుడు సర్వత్రా పవన్ పై సానుభూతి వ్యక్తం అవుతుంది.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ సన్నిహిత మిత్రుడు ప్రముఖ కమెడియన్ అలీ స్పందించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీతి,నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. అతన్ని టచ్ చేసే దమ్ము,దైర్యం లేని వర్మ,లోకేష్ వంటి వారు కుట్రలు పన్నుతున్నారు.

తన మాతృమూర్తిని దూషిస్తూ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఇక చాలు మేము చూస్తూ ఊరికోము. యుద్దానికి సిద్ధం. ఇక మీదట పవన్ మీద ఏమైనా కుట్రలు చేస్తే తోలు తీస్తాం అంటూ అలీ స్పందించాడు.