పవన్ vs లోకేష్….అసలు మ్యాటర్ ఏంటి అంటే…..

శ్రీరెడ్డి వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చి తనకు న్యాయం చేయాలని అడగటం, అలాగే వరుసగా ట్వీట్స్,ఆరోపణలతో తనదైన శైలిలో స్పందించారు. ఇక్కడ కొన్ని విషయాలు పక్కన పెడితే ట్వీట్ లలో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. నారా లోకేష్ అతని స్నేహితులు కలిసి మీడియాను ఉపయోగించుకొని తనను వెన్నుపోటు పొడిచారని సంచలన ఆరోపణలు చేసారు పవన్ కళ్యాణ్. ఆలా కొన్ని రోజులు ముందుకు వెళ్ళితే పవన్ జనసేన ఆవిర్భావ సభలో కూడా లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. లోకేష్ చేస్తున్న అవినీతి ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? తెలిసే ఎందుకు ఉరుకుంటున్నారు. ఇలాంటి విషయాలన్నీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రస్తావించారు.

అసలు పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి ఎక్కడ చెడింది. ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇలా చేస్తే ఎవరికీ వచ్చే లాభం ఏమిటో ఒకసారి చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అవి ఏమిటంటే…పవన్ పై లోకేష్ నిఘా పెంచారని, పవన్ పై అసత్య ఆరోపణలు ప్రచారం చేయిస్తున్నారని, శ్రీరెడ్డి వివాదం ఉపయోగించుకొని తనను మధ్యలోకి లాగారని…ఇలా ఆరు నెలలుగా జరుగుతుందని పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్.
Chandra Babu Nayudu
అయితే ఈ విషయాలపై తెలుగుదేశం నేతలు ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే AP ముఖ్యమంత్రి దీక్షలో ఉండటంతో స్పందించలేదు. అలాగే పవన్ వ్యాఖ్యలకు స్పందించవద్దని తెలుగుదేశం నాయకులకు ఆదేశాలు ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే పవన్ చేసిన విమర్శలు రాజకీయ నాయకులను కలవరపరచేవి…ఆలోచింపచేసివి. తనపై ఆరోపణలు చేయటానికి 10 కోట్లు సిద్ధం చేశారనే పవన్ ఆరోపణలు అసలు నమ్మదగినవేనా? ఒకవేళ దీనిపై ఆధారాలు ఉంటే మాట్లాడారా? లేక ఆవేశంలో మాట్లాడారా అనేది అర్ధం కావటం లేదు.

అలాగే పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ప్లినరీలో లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు. అప్పటి నుండి మిత్రులుగా ఉన్న జనసేన,టీడీపీ శత్రువులుగా మారిపోయాయి. తన సెక్యూరిటీ ద్వారా తన కదలికలను తెలుసుకుంటున్నారని…అందుకే ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని వెనక్కి పంపేశాడు పవన్.

పవన్ పై అసలు కుట్ర ఎందుకు జరుగుతుంది. పవన్ ఆరోపణలలో నిజముందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా లోకేష్ చెప్పాలి. లేకపోతే పవన్ ఆరోపణలు ప్రజలు నిజం అనుకొనే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.