అవును ఛానల్ స్టార్ట్ చేస్తున్న పేరు ఏమిటో తెలుసా?

విపక్ష నేత జగన్ కి సొంతగా డిజిటల్ మీడియా ఉన్న విషయం తెలిసిందే . దాంతో ఏ విషయం అయినా ఆయా ఛానల్ తమ నాయకులకు,పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తుంది. ఇక తాజాగా ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసారు. దీనితో బాబు అనుకూల మీడియా పవన్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీతోను, పార్టీ అధినేత చంద్రబాబుతోనూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో సదరు మీడియా పవన్ కి ప్రాధాన్యత తగ్గించింది. దీనితో వచ్చే ఎన్నికల నాటికీ ఈ ప్రాధాన్యం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని పవన్ గుర్తించాడు.

ప్రస్తుతం పవన్ సినీ రంగం నుండి పెను సమస్యను ఎదుర్కొంటున్నాడు. నటి శ్రీరెడ్డి పవన్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. దీనితో పవన్ కి అనుకూలంగా మాట్లాడే ఒక్క ఛానల్ కూడా జనసేనకు కన్పించటం లేదు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే సొంత ఛానల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడట.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఒక టివి ఛానల్ ని ప్రారంభించటానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వాట్స్ అప్ లో JTV అనే ఒక బేనర్ చక్కర్లు కొడుతోంది.

లోగో డిజైన్ నుంచి బేనర్ లో కనిపిస్తున్న మిగతా అంశాలను పరిశీలిస్తే మాత్రం ఇది జనసేనకు అండగా నిలబడుతుందని తెలుస్తుంది. పవన్ కి సన్నిహితుడు గతంలో ఛానల్ ని నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తితో సుదీర్ఘంగా మంతనాలు జరిపి, పవన్ సపోర్ట్ తోనే JTV వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ JTV లో ఎంత వాస్తవం ఉందో త్వరలోనే తెలుస్తుంది.