పవన్ టార్గెట్ ఏంటి..?

తనను తిట్టించారని..దాని వెనుక పెద్ద కుట్ర ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం…దాని వెనుక నేనే ఉన్నానని రాంగోపాల్ వర్మ స్వయంగా చెప్పడం..కాని లోకేష్ తనపై ఇదంతా చేస్తున్నారని ఆరోపించడం…అసలు పవన్ టార్గెట్ ఏమిటి…? శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని తిట్టింది తప్పే. దానిని ఎవరు కాదనలేరు… వాస్తవానికి గట్టిగా మాట్లాడితే ఆమె అసలు పవన్ తల్లిని విమర్శించలేదు. తెలంగాణాలో హైదరాబాద్ , రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో అది ఒక ఊతపదం.దానికి పవన్ కి అర్ధం తెలియదు…ఒకవేళ తెలిసి ఉండవచ్చు గాని…తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.. అసలు ఆ తిట్టుకి అర్ధం ఏమిటి అనేది తెలియకుండా పోరాటం చేస్తే అవివేకం అవుతుంది.

ఒకవేళ తెలిసి చేస్తుంటే మాత్రం అది రాజకీయంగానే మనం చూడాలి. ఎందుకంటే పవన్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరు కాదన్నా ఒక రాజకీయ నాయకుడు కదా… కొంచెం ఆ వాసన తగిలి కూడా ఉండవచ్చు.ఇకపోతే తనపై కావాలని ఇదంతా చేయిస్తున్నారు అని పవన్ ఆరోపించడం వెనుక అర్ధం ఏమిటి అనేది తెలియదు గాని… అసలు ఆయన ఆరోపించిన వ్యక్తులు దీని వెనుక లేరనేది వాస్తవం.

ఎందుకంటే రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తి దీని వెనుక నేనే ఉన్నాను అని చెప్పుకోవడం చూస్తే అదే అనుమానం వస్తుంది. విజ్ఞత ఉన్న వ్యక్తి రాంగోపాల్ వర్మ..అలాంటి వ్యక్తి దీని వెనుక నేను ఉన్నానని క్షమాపణ చెప్పారు. అయినా పవన్ కొంత మందిని టార్గెట్ చేసారు. దీని బట్టి చూస్తుంటే పవన్ చేస్తున్నది తన తల్లిని తిట్టారనే పోరాటం కాదు… దానికి మరొక లక్ష్యం ఉంది.