పవన్ తీరు తో విసుగెత్తిపోయిన చిరు పవన్ కి దూరంగా ఉండాలని మెగా హీరోలకి ఆదేశం

పవన్ తీరుపై చిరు అసహనం వ్యక్తం చేస్తున్నారట. తనపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పలు మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. చంద్ర బాబు రాష్ట్రము కోసం దీక్ష చేపట్టిన రోజే పవన్ కళ్యాణ్ ఈ రకంగా కొద్దిసేపు రచ్చ చేసి, ఆతర్వాత తన ట్వీటర్ నుంచి కామెంట్స్ పెట్టటం ప్రారంభించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కారణంగా మొదట కొంత సానుభూతి వచ్చినట్టు కనిపించినా అయన తీరు పట్ల ఇప్పుడు ప్రజల్లోనే అసంతృప్తి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ తీరు పట్ల అయన సోదరుడు చిరంజీవి కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ లో నిరసన వ్యక్తం చేయటం వరకు అయితే ఓకే కానీ మీడియా సంస్థలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపుకు చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

ఛానల్స్ పై అసహనం వ్యక్తం చేయవచ్చు. కానీ ఛానల్స్ ని మనం బహిష్కరించటం ఏమిటని చిరు అయన సన్నిహితుల దగ్గర అన్నారట. పవన్ ఇలా వ్యవహరిస్తాడని తాను అనుకోలేదని రాజకీయాల్లోకి వెళ్ళాక మరింత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటాడని భావించానని చిరంజీవి సన్నిహితుల వద్ద వాపోయినట్టు టాక్ వినిపిస్తుంది.
Pawan Kalyan,Chiranjeevi
ఈ విషయంలో పవన్ వ్యవహార శైలి నుంచి మెగా హీరోలందరూ దూరంగా ఉండాలని చిరంజీవి ఆదేశాలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదని పలు మీడియా సంస్థలకు చిరు చెప్పారట.

అందుకే ఈ విషయం గురించి బయట ఎక్కడ మాట్లాడకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. పవన్ తో పాటు వర్మ ఎపిసోడ్ ని కూడా లైట్ తీసుకోవాలని చిరు భావిస్తున్నారని, ఈ విషయంపై ఎటువంటి నిరసనలు చేయకుండా ఎవరి పని వారు చేసుకోవాలని మెగా ఫ్యామిలీ హీరోలకు గట్టిగా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.