మెగాస్టార్ తమ్ముడికి తోడు రాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక మొదటిసారి యుద్ధం చేస్తున్నాడు. తనను,తన తల్లిని అనరాని మాటలను అన్నవారిని,దానిని పెద్దది చేసి తనపై వ్యక్తిగత దాడులు చేసిన వారితో పవన్ మినీ సైజ్ వార్ చేస్తున్నాడని చెప్పవచ్చు. ఒకే సారి AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు TV 9,ABN,TV 5 లతో ఫైట్ చేస్తున్నాడు. ఈ సంగ్రామంలో పవన్ కి సపోర్ట్ చేసేవారితో పాటు విమర్శించేవారు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం చేస్తున్న పవన్ ఇటు వ్యక్తిగతంగానూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వరుస ట్వీట్స్ తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతున్నారు. మా అమ్మను ఇంత మాట అంటారా అంటూ నాగబాబు ఎమోషనల్ ప్రెస్ మీట్ తో అందరిని కడిగి పారేసారు. ఇక ఫిలిం ఛాంబర్ లో దీక్షకు వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,బన్ని సంఘీభావం ప్రకటించారు.

ఇంత జరుగుతున్నా మెగా స్టార్ చిరంజీవి ఎక్కడా అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవర్ స్టార్ సినిమాలను వదులుకొని మెగాస్టార్ కి మద్దతు ఇచ్చాడు. యువరాజ్యం బాధ్యతలను తీసుకోని ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.

ఇప్పుడు పవన్ ఒక్కడే తనను వ్యక్తిగతంగా విమర్శించినా వాళ్ళను ఒంటరిగా ఎదుర్కొంటున్నాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. నాగబాబు,బన్ని లాంటి వాళ్ళు వచ్చిన పవన్ కి సానుభూతిగా తప్పితే మరే ఉపయోగం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదే మెగాస్టార్ వచ్చి ఒక స్టేట్ మెంట్ ఇస్తే సీన్ ఇంకోలా ఉండేది. రాజకీయంగా చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నా వ్యక్తిగతంగా పవన్ కి మద్దతుగా ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే చిన్న విషయాన్నీ వదిలేస్తేనే బెటర్ అనే ఆలోచనలో చిరు ఉన్నారని కొంత మంది చెప్పుతున్నారు.

పవన్ ఒంటరిగా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో ఇద్దరు వేరువేరు వెర్షన్స్ వినిపిస్తే బాగోదనే వారు కూడా ఉన్నారు. అయితే చిరు చేస్తున్న సైరా సినిమా భారీ బడ్జెట్ సినిమా కావటంతో ఊపిరి తీసుకొనే సమయం లేనంత బిజీగా ఉన్నారట.

ఇంత బిజీ షెడ్యూల్ లో చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని అయన సన్నిహితులు చెప్పారట. ఇక పవన్ చిరంజీవి ఎంట్రీని ఒప్పుకోలేదనే వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.