వీరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలు దుమ్ము రేపుతున్నారు. దద్దరిల్లే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. 100 నుంచి 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతూ తమ స్టామినా ఏమిటో చూపిస్తున్నారు. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ హీరోలు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. మన స్టార్ హీరోలు కూడా కథలను ఎంచుకొనే సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోని హిట్స్ కొట్టి నిర్మాతను సేఫ్ జోన్ లో ఉంచుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా భారీ సినిమాలు తీయటానికి ముందుకు వస్తున్నారు.నిర్మాతలకు కూడా బాగానే లాభాలు ఉంటున్నాయి.మన టాలీవుడ్ స్టార్ హీరోలు అసలు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారో చూద్దాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 12 నుంచి 14 కోట్ల వరకు తీసుకుంటాడు.

హిట్స్,ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఇమేజ్ ని అమాంతం పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా కోసం 18 కోట్లు తీసుకున్నాడట.

భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఒక్కో సినిమాకి 18 కోట్లను తీసుకుంటున్నాడు.

వరుస హిట్స్ జోరు మీద ఉన్న ఎన్టీఆర్ 18 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాకి గాను 25 కోట్లు పారితోషికం తీసుకున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’,దువ్వాడ జగన్నాధం వంటి హిట్ సినిమాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా మారనున్నాడు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 14 కోట్ల వరకు తీసుకుంటాడు.