నా పేరు సూర్యలో నటించిన ఈ విలన్ ఎవరో తెలుసా? ఈయన గురించి తెలిస్తే షాక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,రచయత వక్కతం వంశీ దర్శకత్వంలో వస్తున్న నా పేరు సూర్య సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. మిలటరీ మాధవరం గ్రామంలో ఆడియోని విడుదల చేసింది. ఈ సినిమాను మే 4 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ రోజు హైదరాబాద్ లో గచ్చిబోలిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా జరపటానికి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. నా పేరు సూర్య సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. నా పేరు సూర్య సినిమా ట్రైలర్ ని పరిశీలిస్తే ముగ్గురు కీలక పాత్రధారులు కన్పించారు. సీనియర్ హీరోలు అర్జున్,శరత్ కుమార్,సాయి కుమార్ లు కీలకమైన పాత్రల్లో నటించారు. ట్రైలర్ చూస్తే శరత్ కుమార్ విలన్ అని అన్పిస్తుంది. కానీ ఈ సినిమాలో ఒక యంగ్ విలన్ ఉన్నాడట.

అతన్ని ట్రైలర్ లో చూపించకుండా సస్పెన్స్ క్రేయేట్ చేసారు. ఆ సరికొత్త విలన్ పేరు ఠాగూర్ అనూప్ సింగ్. అనూప్ సింగ్ మహారాష్ట్రకి చెందినవాడు. మార్చి 29 1989 లో జన్మించాడు. 2013 లో హిందీలో వచ్చిన మహాభారత్ టివి సీరియల్ లో దృతరాష్ట్ర పాత్రను పోషించి అందరిని ఆకట్టుకున్నాడు.

అంతేకాదు అనూప్ కి కండలు పెంచటం అంటే చాలా సరదా. అలానే పెంచి బ్యాంకాక్ లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అనూప్ మంచి నటుడే కాకుండా మంచి క్రీడాకారుడు. మొదట అనూప్ తమిళంలో వచ్చిన సింగం 3 లో నటించాడు.

ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో విలన్ గా నటించాడు. ఆ తర్వాత కన్నడలో రోగ్,హిందీలో కమాండో సినిమాలో నటించి మెప్పించాడు. మంచి ఫిజిక్,పొడవైన జుట్టు,విలనిజం ఉండటంతో దర్శకుడు వక్కతం వంశీ ఏరి కోరి బన్నికి సరితూగేలా అనూప్ ని ఎంచుకున్నాడట.

ఈ సినిమాలో అనూప్ సింగ్ బన్నితో పోటీ పడి మరీ నటించాడట. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో సమానంగా స్టైలిష్ లుక్ కోసం కండలు పెంచాడు. అలాగే డబ్బింగ్ కూడా తానే చెపుకున్నాడట. వీరిద్దరి మధ్య వచ్చే ఫైటింగ్స్ అదిరిపోయాయట.