కంటి చుట్టూ నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే….

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం, రాత్రి,పగలు తేడా లేకుండా ఎక్కువగా వెలుతురు ముందు గడపటం వంటివి కళ్ళ సమస్యలకు కారణం అవుతాయి. దీని వలన క్రమంగా నల్లటి చారలు,ముడతలు ప్రారంభం అవుతాయి. వీటిని తగ్గించాలంటే కీరదోసను ముక్కలుగా కోసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి, ఆ తర్వాత కనురెప్పలపై పెట్టి పది నిముషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.అదే పనిగా ఎండలో తిరుగుతున్నా, దుమ్ము ధూళి ముఖంపై పడుతున్నప్పుడు తరచుగా కళ్ళను కడుక్కోవాలి. అలాగే బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పచ్చిపాలలో ముంచిన దూదితో కళ్ళ చుట్టూ రాయాలి. కొంచెం సేపు అయ్యాక చన్నీళ్ళతోకడగాలి. దీని వల్ల కంటి కింద నల్లటి మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.

కళ్ళ చుట్టూ ముడతలు ఏర్పడినప్పుడు బంగాళాదుంప గుజ్జులో ఒక స్పూన్ తేనే కలిపి రాసుకోవాలి. ఆ సమయంలో నవ్వకూడదు. లేదంటే ముడతలు ఏర్పడతాయి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ
ఉంటేకళ్ళు అందంగా,ఆరోగ్యంగా కనపడతాయి.