చిరంజీవిని అవమానిస్తే సినిమా హిట్ అవుతుందని చెప్పిన దర్శకుడు

మెగా స్టార్ చిరంజీవి అన్న ఒక్క పేరు వినగానే ఫాన్స్ భూమిమీద నిలువరు, ప్రజల్లో చిరంజీవి కి అంత క్రేజ్ ఉంది. తన కెరీర్ మొదలు నుండి మంచి కథలను ఎంపికచేసుకునే వారు. అయన మంచి డిఫ్రెంట్ కథలను ఎంచుకున్నారు.ఆయన దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించారు. ఆలా కొత్త కథలు, ఆయన నటన, ఆయన డాన్స్ ఇలాంటి అద్భుతమైన ప్రతిభలు ఆయనకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. అలా కథకు ప్రాధాన్యత ఇచ్చి సినిమాకు ఒప్పుకున్న సినిమా ఇంట్లో రామయ్య వీధిలోకృష్ణయ్య . ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ గారు తెరకెక్కించారు. ఈ సినిమా కోసం కోడి రామకృష్ణ గారు ప్రముఖ నిర్మాత అయిన కే. రాఘవ వద్దకు వెళ్లారు. ఆయన ఊహించని విధంగా ఆయన స్పందించారు.

బాబు మనకు కొంతమంది స్టాండర్డ్ హీరో లు ఉండగా చిరంజీవి ఎందుకు అని అడిగారట, అప్పుడు కోడి రామకృష్ణ ఇలా బదులు చెప్పారట ‘ నా సినిమా లో కథకు తగ్గట్టుగా చిరంజీవి మాత్రమే బాగుంటారు. ‘ మర్నాడు కే.రాఘవ ప్రొడక్షన్ పెద్దలతో మీటింగ్ పెట్టి వారి మధ్య కోడి రామకృష్ణ గారు నిలబెట్టి నిలదీశారు.

అప్పుడు కోడి రామకృష్ణ గారు నా సినిమా లో భార్య భర్తని అవమానిస్తుంది బాగా నిలదీస్తుంది. ఆ పాత్రలో చిరంజీవి గారు ఉంటే ప్రజలు ఆసక్తి గా చూస్తారు , చాలా కొత్తగా ఉంటుంది అని కన్విన్స్ చేశారు.

ఈ మీటింగ్ తరువాత నిర్మాతలు చిరంజీవికి ఒకే అని చెప్పారు. అయితే చిరంజీవికి విషయం చెప్పినతరువాత ఆయన రెమ్యునరేషన్ అడగకుండా పనిచేశారని గుర్తుకు తెచ్చుకొని ఇలా అన్నారు ‘ ఆయన ఇంత మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆయన ఒక మెగాస్టార్ అయ్యారు. ‘