సావిత్రి పాత్ర వదులుకున్న హీరోయిన్….ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

మన ఇండస్ట్రీ లో ఈ మధ్య కాలంలో బయోపిక్ రాలేదు. మొన్న మే 9 న విడుదలైన మహానటి సినిమా అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఈ సినిమా లో సావిత్రి గా నటించింది మన అభిమాన నటి కీర్తి సురేష్, అయితే ఈమె నటనతో అందరిని మంత్రముగ్ధులను చేసింది,అలాగే ఈ పాత్రకు ప్రాణం పోసింది. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి మళ్ళీ జన్మించినట్లుందని సావిత్రి గారి కూతురు చెప్పారు. అంతలా తన క్యారక్టర్ లో మునిగిపోయింది కీర్తి సురేష్. అయితే ఈ సినిమా లో సావిత్రి గారి పాత్రను చేయమని ముందు మహానటి యూనిట్ నిత్యామీనన్ ను సంప్రదించారు కానీ ఆ అవకాశాన్ని నిత్యామీనన్ వదులుకుంది.

ఇదే కీర్తి కు వరమైంది. కీర్తి సురేష్ లో ఒక కొత్త కళాకారినిని నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా చూపించారు. ఈమె నటనకు ఉత్తమ నటి అవార్డు వస్తుందని చాలామంది ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసి ఒక మంచి నటిగా ఎంతో ఎత్తు ఎదిగింది కీర్తి.