తీపి గవ్వలు

కావలసినపదార్దాలు

మైదా– 500గ్రా,బొంబాయిరవ్వ– 100గ్రా,నెయ్యి– 120గ్రా,చక్కెర– 150గ్రా,గుడ్డు-1,యాలకులు -5 గ్రా,బేకింగ్‌పౌడర్‌– చిటికెడు,రిఫైన్డ్‌ఆయిల్‌– వేయించడానికి తగినంత

తయారుచేసేవిధానం
ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనను తీసుకోని స్పూన్‌తో బాగా గిలకొట్టాలి. అందులో చక్కెర కూడా వేసి పూర్తిగా కరిగించాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడాపోయాలి. అందులో యాలకుల పొడిని కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని పక్కనపెట్టాలి.

ఇప్పుడు మైదా పిండిలో బేకింగ్‌ సొడా కలిపి జల్లించాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోని బొంబాయిరవ్వ, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అంటే చిన్నగోలిసైజులో చేసి ఉంచాలి. గవ్వల చెక్కెపై బొటన వేలితో పిండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. పిండి చుట్టుకొని గవ్వ తయారవుతుంది. ఈ విధంగా తయారైనగవ్వలను కాగుతున్న నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.