వేసవిలో జిడ్డు చర్మం కోసం బెస్ట్ పాక్స్

జిడ్డుచర్మం కలవారు అందంగా ఉండటం కొరకు అనేక రకాల పద్దతులను ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొని వాడుతూ ఉంటారు. దీని వలన ముఖసౌందర్యం సంగతి ఎలా ఉన్నా అసలుకే మోసం రావచ్చు. అలాకాకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఇంటిలో చేసుకొనే పద్దతులను ఆచరిద్దాం.

* గోధుమపిండిలో కొంచెం నీరు పోసి పేస్ట్ గా తయారుచేసి ముఖానికి పట్టించాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మీద ఉన్న జిడ్డును ఈ మిశ్రమం పూర్తిగా తొలగించటానికి సహాయపడుతుంది.

* రెండు స్పూన్స్ పచ్చిపాలు, రెండుస్పూన్స్ దోసరసం, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈమిశ్రమాన్ని ముఖానికిపట్టించిబాగా ఆరాక శుభ్రం చేసుకోవాలి.

* ఒకస్పూన్ మెంతి గింజలను ఒకరాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి ఉదయం పేస్ట్ చేసి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

* రెండు, మూడు బాదంపప్పులను మెత్తగా రుబ్బి, దానికి అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

* సీసా నీటిలో చిన్న స్పూన్ ఉప్పు వేసి ఆనీటితో రోజులో వీలు అయినన్ని సార్లు ముఖాన్ని కడగాలి. ముఖం మీద జిడ్డును తొలగించానికి ఉప్పు బాగా పని చేస్తుంది.

* అరకప్పు యాపిల్ గుజ్జు, అర కప్పుఒట్మిల్, అరస్పూన్నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన తీసుకోని బాగా కలిపి ఈమిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తేమంచి పలితం కలుగుతుంది.

* వెనిగర్ లోదూది ముంచి ముఖం అంతా పట్టించాలి. స్నానంనకు ముందు ఈవిధంగా చేసి అనంతరం స్నానం చేయాలి. వెనిగర్ జిడ్డు ను సమర్దవంతముగా ఎదుర్కొంటుంది.