కోవా కజ్జికాయలు

కావలసిన పదార్దాలు

మైదా : అరకేజీ,కోవా : 2 కప్పులు,నెయ్యి : 3 టేబుల్స్పూన్లు,ఉప్పు : చిటికెడు,నూనె : వేపటానికి సరిపడా,కొబ్బరి తురుము : 1 కప్పు
పంచదార పొడి : 4 కప్పులు,యాలుకల పొడి : 1 టీస్పూన్డ్రై,ఫ్రూట్స్ ( చిన్నగాకట్చేసుకోవాలి ) – ఒకకప్పు

తయారుచేసే విధానం
ముందుగా మైదాలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి, కొంచెం నీరు పోసి ముద్దలాచేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కోవా వేసి స్టవ్ మీదపెట్టాలి. కొంచెం సేపటికి రంగు మారుతుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నెనుకిందికి దించి చల్లారిన తరువాత, దానిలో ఒకకప్పు పంచదారపొడి, కొబ్బరితురుము, డ్రైఫ్రూట్స్ ముక్కలు, యాలుకుల పొడి వేసి కలిపి పక్కనపెట్టాలి.

ఇప్పుడు మైదా ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతిలా చేసి, మద్యలో పైన తయారుచేసుకున్న కోవా మిశ్రమాన్ని పెట్టి, చపాతిని మడిచి, కజ్జికయలా ఒత్తాలి. ఇలా అన్నీ చేసుకున్నాక, స్టవ్ వెలిగించి బాండిలో నూనె పోసివేడి చెయ్యాలి.

నూనె కాగాక కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. పక్క స్టవ్ మీద వేరే గిన్నెలో మిగిలిన పంచదార పొడి వేసి, కొద్దిగా నీరు పోసిలేత పాకం పట్టాలి. ఇప్పుడు వేగిన కజ్జికాయలను తీసిన వెంటనే పాకంలో వేసికాసేపు వుంచి తీసి చల్లారనివ్వాలి. అంతే తియ్యతియ్యని కోవా కజ్జికాయలు తినటానికి రెడీ!!!