లక్షల జీతాన్ని వదులుకున్న యాంకర్ లాస్య… ఎందుకు… ఏమైంది?

వెండితెర,బుల్లితెర సంగతులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కడపకు చెందిన లాస్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బాగా చదివే లాస్య హైదరాబాద్ గూగుల్ క్యాంపస్ లో ఉద్యోగాన్ని సంపాదించింది. మంచి మాటకారి,అందం ఉన్న లాస్యను చూసిన కొందరు నిర్మాతలు టివిలో యాంకరింగ్ అవకాశాన్ని ఇచ్చారు. దాంతో లాస్య లక్షలు వచ్చే గూగుల్ ఉద్యోగాన్ని వదిలేసి యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత కో యాంకర్ రవితో కలిసి మా టివి,మా మ్యూజిక్ లలో సందడి చేసింది. అనేక రొమాంటిక్ పాటలలో కూడా లాస్య,రవి జంట అలరించారు. చాలా కాలం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే గుసగుసలు వినిపించాయి.

ఆ తర్వాత ఏమైందో తెలియదు కాదు వారిద్దరూ జంటగా కనిపించటం మానేశారు. ఈ టివిలో ఢీ జోడి కార్యక్రమం చేసిన తర్వాత ఇద్దరు విడిపోయారనే వార్తలు వచ్చాయి. అందుకే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన కార్యక్రమం ఏది లేదు. ఆ మధ్య జీ తెలుగులో జబర్దస్త్ చంటి లాస్యను రవి గురించి అడగగా లాస్య చాలా సీరియస్ అయ్యింది.

దాంతో అందరూ లాస్య,రవి విడిపోయారని అర్ధం అయింది. ఇక రవి లాస్యను దూరంగా ఉంటూ అనేక టీవీ షో లలో హీరోయిన్ కమ్ యాంకర్ శ్రీముఖితో క్లోజ్ గా మూవ్ అవుతూ షో లు చేస్తున్నాడు.

అయితే లాస్య యాంకర్ రవితో దూరం అయ్యాక మరాఠీ యువకుడు మంజునాద్ ని పెళ్లి చేసుకుంది. అతను ఒక పారిశ్రామిక వేత్త కొడుకు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్ళికి టివి యాంకర్స్ అందరూ హాజరు అయ్యారు. పెళ్లి అయ్యాక లాస్య పూర్తిగా బుల్లితెరకు దూరం అయింది.