నిన్ను నమ్మి నాదగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నా.. మోసం చేశావు..!

పూరి జగన్నాద్ కొడుకుని హీరోగా సక్సెస్ చేయాలనే ఆతృతలో కథను సరిగా రాసుకోలేకపోయాడనే వార్తలు వినపడుతున్నాయి. ‘మెహబూబా’ సినిమాను ప్రేక్షకులు మొదటి రోజే తిప్పికొట్టారు. ‘మెహబూబా’ సినిమాతో కొడుకును సెటిల్ చేసి,తాను కూడా డైరెక్టర్ గా బిజీ అవ్వాలని ఆశించాడు. అయితే ‘మెహబూబా’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా కోసం పూరి కసిగా పనిచేస్తున్నాడని అందరూ భావించారు. అయితే సినిమా విడుదల అయ్యాక తుస్సు మంది. రివ్యూలు,రేటింగ్ లు కూడా నెగిటివ్ గా ఉండటంతో కమర్షియల్ గా కూడా ఈ సినిమాకి గట్టి దెబ్బె పడింది.

బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు చాలా ఉండటం, నెగిటివ్ టాక్ రావటం కూడా సినిమాను ఘోరంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కారణంగా దర్శకుడు పూరితో పాటు హీరోయిన్ ఛార్మి కూడా బాగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఛార్మి పూరీ క్రియేటివ్ వర్క్స్ టీమ్‌లో ఉంటూ మెహబూబా’ సినిమాలో కూడా భాగం అయింది.

ఈ సినిమా డిజాస్టర్‌ కావటంతో ఛార్మికి కూడా నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తుంది. ఛార్మికి 5 కోట్లకు పైనే నష్టం వచిన్నట్టు వార్తలు ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమాలో నటిగా సంపాదించిన డబ్బును ‘మెహబూబా’ సినిమాలో పెట్టి లాస్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి అధికారిక ధ్రువీకరణ లేదు. సినీ జనాల మధ్యన ఈ చర్చ జరుగుతోంది.