Movies

అప్పట్లో సావిత్రి,శివాజీ గణేశన్ లతో చిరంజీవి సాధించిన అద్భుత ఘనత

మహానటి సినిమాలో అందరి సానుభూతి సావిత్రి గారి వైపే ఉండటం, సావిత్రి గారు ఈ స్థితికి రావటానికి కారణం అయిన జెమిని గణేష్ మీద కోపం మహిళ ప్రేక్షకులకు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లకు విలన్ గా కన్పిస్తూ ఉండగా, అప్పట్లోనే రొమాన్స్ కింగ్ గా ముగ్గురి భార్యలకు భర్తగా ఏడుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న జెమిని గణేశన్ ఉన్నాడు. మహానటి సినిమా ద్వారా జెమిని గణేశన్ వ్యక్తిగత జీవితం చూసే అవకాశం కలిగింది. మహానటి సావిత్రి గురించి అందరికి తెలుసు. కానీ జెమిని గణేశన్ గురించి తెలిసిన వారు మనలో చాలా తక్కువ. ఇక్కడ ఒక విశేషం ఉంది. జెమిని గణేశన్ ఒక తెలుగు సినిమాలో నటించాడు. రుద్రవీణ సినిమాలో చాందస్తుడైన బ్రాహ్మణ పాత్రలో చిరంజీవికి తండ్రిగా కన్పిస్తారు.

ఈ సినిమాలో ఇద్దరూ పోటీపడి నటించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సావిత్రి గారితో కూడా చిరంజీవి ఒక సినిమా చేసాడు. చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్లు సినిమాలో సావిత్రి గారు ఒక కీలకమైన పాత్రను పోషించారు.

అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న వేషం. ఆవిడ అప్పటికే చాలా చితికిపోయి ఉన్నారు. ఆ సినిమా తర్వాత సావిత్రి గారు నాలుగైదు సినిమాల కన్నా ఎక్కువ చేయలేదు. సావిత్రి గారు చనిపోయాక చిరంజీవి మెగాస్టార్ అయ్యాక రుద్రవీణ సినిమాలో జెమిని గణేశన్ తో కలిసి నటించే అవకాశం లభించింది.

అయితే చిరంజీవి గారు సావిత్రి గారితో నటించిన విషయాన్నీ గుర్తుకు చేసుకున్నారు. కానీ రుద్రవీణ సినిమాలో నటించిన జెమిని గణేశన్ గురించి అసలు మాట్లాడలేదు.