తారక్ ఫస్ట్ లుక్ అదుర్స్…. కానీ ఈ తేడాలు గమనించారా?క్లియర్ గా చూస్తే షాక్ అవుతారు

యాంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 28 వ సినిమా ఫస్ట్ లుక్ ని చెప్పిన సమయానికి ఫర్ఫెక్ట్ గా విడుదల చేసారు. త్రివిక్రమ్ కథ ఎప్పటిలాగే క్లాస్ లుక్ ని విడుదల చేస్తారని అందరు భావించారు. ఆ అంచనాలకు బిన్నంగా ఊర మాస్ లుక్ తో విడుదల చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. చేతిలో వెపన్ పట్టుకొని రక్తపు మరకలతో కూడిన ప్యాంటు వేసుకొని కన్పిస్తున్న తారక్ ఆలా నడిచి వస్తున్న ఆ లుక్ చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే. గతంలో వచ్చిన టెంపర్ లుక్ కి కాస్త పోలినట్టు అనిపించినా అది క్లాస్ గా ఉంటే ఇది ఊర మాస్ గా ఉంటుంది. ఈ లుక్ తారక్ కెరీర్ లోనే బెస్ట్ లుక్ గా చెప్పుకోవచ్చు.

కండలు తిరిగిన ఆ బాడీ,ఆ ఠీవి, కళ్ళలో ఆ పౌరుషం ఎంత పొగిడిన తక్కువే. కాకపోతే గడ్డం,మీసం,హెయిర్ స్టైల్ అన్ని దాదాపు జనతా గ్యారేజ్ ని పోలినట్టు ఉన్నాయి. అంతా బాగుంది కానీ టైటిల్ దగ్గరే కాస్త తేడా కొడుతోంది. ఆలా అని టైటిల్ బిగోలేదని కాదు. చదవటానికి క్లాస్ గా ఉన్నా ఆ టైటిల్ కి తారక్ కి సంబంధం లేనట్టు ఉంది.

వీర రాఘవ అనే క్యాప్షన్ కి సరిగ్గా సరిపోయింది. అయితే టైటిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఇలాంటి టైటిల్ తో ట్విస్ట్ ఇవ్వటం మాములే. ఈ సారి త్రివిక్రమ్ యంగ్ టైగర్ తో ఏమి మేజిక్ చేయనున్నాడో చూడాలి. కొద్దీ పాటి మైనస్ లను తీసేస్తే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫుల్ మీల్స్ అందించిందని చెప్పుకోవచ్చు.