ఎన్టీఆర్ పుట్టినరోజుకి లక్ష్మి ప్రణతి ఏ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా?

ఎన్టీఆర్ పుట్టినరోజుకి వారం రోజుల ముందు నుంచి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే,ఎన్టీఆర్ సెలబ్రేషన్స్,ఎన్టీఆర్ బర్త్ డే వీక్ అంటూ HAST టాగ్ ని ట్రోల్ చేస్తూ సింహాసనం మీద కూర్చున్న ఎన్టీఆర్ ఫోటో పెట్టి శుభాకాంక్షలు చెప్పుతున్నారు. అభిమానులతో పాటు సెలబ్రేటిస్ కూడా మా రావణ్ కి బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అంటూ వరుస ట్వీట్స్ చేసారు. ఇది ఇలా ఉంటె నిన్న ఎన్టీఆర్ 28 వ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు హారిక హాసిని వారు. ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. అరవింద సమేత వీర రాఘవలో ఎన్టీఆర్ లుక్ చాలా సాఫ్ట్ గా ఉంటుందని భావించిన వారికీ రఫ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు.

త్రివిక్రమ్ తన మార్క్ తో బయటకు వస్తాడని అందరు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ కి సర్ ప్రయిజ్ గిఫ్ట్ ఇచ్చిందట. ఎన్టీఆర్,లక్ష్మి ప్రణతిలకు ఒక బాబు ఉన్నాడు. ప్రసుతం లక్ష్మి ప్రణతి ప్రెగ్నెంట్. ఒక వారంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

లక్ష్మి ప్రణతికి అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ బాగా నచ్చిందంట. ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందని తెగ తెగ మెచ్చుకుందట. దాంతో ఎన్టీఆర్ ఖుషి అయ్యిపోయి బర్త్ డే గిఫ్ట్ గా ఫీల్ అయ్యాడట. ఎందుకంటే లక్ష్మి ప్రణతి ఎప్పుడో కానీ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి మాట్లాడదు.

అంతేకాక ఎన్టీఆర్ మరో వారం లోపు మరో శుభవార్తను విననున్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు మరియు అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ జోష్ తో అభిమానులు ఉన్నారు. మరొక వారంలో మరొక శుభవార్తతో అభిమానులు మరియు ఎన్టీఆర్ ఖుషి కానున్నారు.