“నాన్న బ్యాంకాక్ వెళ్లేది అందుకే.!” పూరి గురించి సంచలన విషయం బయటపెట్టిన ఆకాష్!

పూరీ డైలాగ్ అంటేనే ఇంచు ఇంచుకో పంచ్ ఉంటుంది. హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేసేదిగా ఉంటుంది. సూటిగా సుత్తిలేకుండా…బుల్లెట్ దించేలా ఉంటుంది. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ అంటే చాలా ఇష్టమని అందరికి తెలిసిందే.. ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తాడని, అక్కడి బీచ్‌లో ఇసుక తిన్నెలపై కూర్చొని కథలు రాసుకుంటాడని చాలా వార్తలు వినే ఉంటారు. దీనిపై ఆయన కుమారుడు ఆకాశ్ పూరి కూడా స్పందించాడు.ఆకాశ్ తండ్రి పూరీ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. లవ్ స్టోరీ బాగున్నా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. పూరి మార్క్ మిస్ అయ్యింది తెలిపారు ఆడియన్స్.

ఇది ఇలా ఉండగా…ఇటీవల ఆకాశ్ పూరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆయన స్టోరీలు రాయడానికే బ్యాంకాక్ వెళ్తాడనే విషయం నిజమేనని తెలిపాడు. ఇక్కడ ఉండే ఒత్తిళ్ల వల్ల ఆయన కథలపై దృష్టి పెట్టలేరని, అందుకే ఆయన బ్యాంకాక్‌ వెళ్లి కథలు సిద్ధం చేసి తిరిగి వస్తారని చెప్పాడు.

‘‘బ్యాంకాక్ అంటే నాన్న తీసిన ‘చిరుత’ సినిమాలో చూపించినట్లు మసాజులు మాత్రమే కాదు.. అది చాలా మంచి ప్రాంతం. అక్కడ మంచి కుటుంబాలు కూడా నివసిస్తాయి’’ అని ఆకాశ్ తెలిపాడు.