Movies

ఎన్టీఆర్,రామ్ చరణ్,మహేష్ బాబులతో అల్లు అర్జున్ ఎందుకు కలవడు…నిజాలు ఏమిటో తెలుసా?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు సినిమా వేడుకలకు ఎన్టీఆర్,రామ్ చరణ్ వెళ్ళుతున్నారు. ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఒకరి వెడ్డింగ్ పార్టీకి మరొకరు వెళ్ళటం,మహేష్ భార్య నమ్రతతో రామ్ చరణ్ భార్య ఉపాసన ఫ్రెండ్ షిప్ చేయటం, అలాగే ఉపాసన,నమ్రత ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో కూడా ఫ్రెండ్ షిప్ చేయటం… వంటి అద్భుతమైన విషయాలు గత మూడు నెలల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటో ఎంతటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో…అంతే సెన్సేషనల్ క్రియేట్ చేసింది రామ్ చరణ్,మహేష్ బాబు,ఎన్టీఆర్ ఫోటో.

మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ పార్టీలో మహేష్,రామ్ చరణ్,ఎన్టీఆర్ ఎలా సందడి చేసారో మనం చూసాం. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజున రామ్ చరణ్,ఎన్టీఆర్ ఎంత ప్రేమగా ఫోటో దిగారో చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను చూసాం.

ఇప్పుడు ఎన్టీఆర్,మహేష్,రామ్ చరణ్ ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ మధ్య వీరు చేస్తున్న హంగామా మాత్రం అభిమానులకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు పార్టీకి రామ్ చరణ్,మహేష్ హాజరయ్యారని సమాచారం.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు వీరు ముగ్గురేనా….వీరితో బన్ని కలవడా ? అంటూ కొందరు అంటున్నారు. అల్లు అర్జున్ గాని అల్లు అర్జున్ భార్య స్నేహ గాని మహేష్ భార్య నమ్రతతో గాని, రామ్ చరణ్ భార్య ఉపాసనతో గాని కలిసి ఎప్పుడు కన్పించలేదు.

చరణ్,అల్లు అర్జున్ ఇద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నా బయట మాత్రం పెద్దగా క్లోజ్ నెస్ కన్పించదు. అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో ఫ్రీ గా మూవ్ అయింది కూడా లేదు. అల్లు అర్జున్ ఒక అవార్డు వేడుకలో ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పాడు అంతే. రామ్ చరణ్ వలె ఫ్రీ గా మూవ్ అవ్వదు.

రామ్ చరణ్,మహేష్ ఇంత క్లోజ్ గా మూవ్ అవుతుంటే… బన్ని మాత్రం భార్య స్నేహ రెడ్డితో కలిసి ముంబైలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడట. మహేష్,రామ్ చరణ్,ఎన్టీఆర్ ఇలా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటే బన్ని ఎక్కడ…బన్ని ఎక్కడ అంటున్నారు సినీ విశ్లేషకులు.