Movies

మహానటి సినిమాలో రెండు అతి పెద్ద తప్పులు ఇవే….రమాప్రభ చెప్పిన నిజాలు

ఒక సినిమాలో కథ , డైరెక్టర్ ఊహ చాలా కావలసినవి. మరి ఇక బయో పిక్ లలో ఎవరి గురించైతే సినిమాను చిత్రీకరిస్తున్నరో వాళ్ళ గురించి పూర్తీ విషయాలను తెలుసుకొని సినిమాను తీయాలి. తాజా గా విడుదలైన బయోపిక్ మహానటి. ఈ సినిమాను చాలా బాగా చిత్రీకరించారు. కానీ దానిలో చాలా వరుకు అబద్దాలే ఉన్నాయని కొన్ని పత్రికల్లో వచ్చాయి . మహానటి సినిమా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కానీ దానిలో నిజాన్ని పూర్తిగా చూపించలేదని వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ , క్యారక్టర్ ఆర్టిస్ట్ రమాప్రభ ఈ సినిమాను 70 శాతం తప్పులతో తీశారని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ నటించిన కే.వి చౌదరి పాత్రను తప్పుగా చూపించారు. అసలు జీవితంలో ఆ క్యారక్టర్ లో చాలా నెగటివ్ లు ఉన్నాయని అన్నారు. ఆయనే సావిత్రికి మద్యం అలవాటు చేశారన్నారు. జెమినీ గణేశన్ చాలా మంచి వ్యక్తి అని, సావిత్రి తన మొండి తనంతోనే అందరిని దూరం చేసుకుందని అన్నారు.

సావిత్రితో 10 సంవత్సరాల అనుబంధం ఉందని, ఇలా అనుబంధం ఉన్నవారిని సంప్రదించకుండా సినిమా మొదలు పెట్టినప్పుడే సినిమాలో తప్పులు ప్రారంభం అయ్యాయని రమాప్రభ అన్నారు.