Movies

రేష్మికి అందుకే తెలుగు రాదు…. రేష్మి ఏమి చదువుకుందో తెలిస్తే షాక్

యాంకర్ రేష్మి అంటే తెలుగునాట తెలియని వారు ఎవరు ఉండరు. ఈ హాట్ యాంకర్ తన అందం,అభినయనంతో కుర్రకారు మతి పోగొడుతుంది. అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో గైహాజరు కావటంతో రేష్మి జబర్డస్త్ కి వచ్చింది. ఈ కార్యక్రమం రేష్మీకి మంచి బ్రేక్ ఇచ్చింది. మొదట్లో సినిమాల్లో నటించిన సరైన అవకాశాలు లేక బుల్లితెరను ఆశ్రయించింది. రేష్మి బుల్లితెరకు వచ్చాక ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చాలా షోస్ చేసుకుంటూ బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తుంది. రేష్మి 1982 ఏప్రిల్ 27 న విశాఖపట్నంలో జన్మించింది. ఆమె చదువు పూర్తి కాగానే సినిమాల మీద మోజుతో హైదరాబాద్ వచ్చేసింది. సినిమా అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేయగా 2011 లో ఒక తమిళ రొమాంటిక్ సినిమాలో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ప్రస్థానం సినిమాలో రేష్మి సపోర్టింగ్ రోల్ లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోలీ,థాంక్స్,కరెంట్,బిందాస్,గురు వంటి సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో చేసింది. ఆ తర్వాత బుల్లితెరకు వచ్చేసింది. రేష్మి జబర్దస్త్ కార్యక్రమంతో పాపులర్ అయ్యాక ఆమెకు హీరోయిన్ గా చేసే ఛాన్స్ మరోసారి తలుపు తట్టింది.

గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా అందాలు ఆరబోసి టాలీవుడ్ ని షేక్ చేసింది. తాజాగా రిలీజ్ అయినా Next నువ్వే సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇక రష్మీ వ్యక్తిగత విషయానికి వస్తే… రేష్మి పూర్తి పేరు రేష్మి గౌతమ్. రేష్మి పూర్వికులు ఓడిశాలోని బరంపురం వాసులు. రేష్మి తండ్రి సాహో గౌతమ్ విశాఖపట్నం వచ్చి సెటిల్ అయ్యారు.

రేష్మి తండ్రి ఉద్యోగ రీత్యా వైజాగ్ లో ఉండుట వలన రేష్మి కూడా వైజాగ్ లోని డిగ్రీ వరకు చదివింది. రేష్మికి ఒడిసి బాష బాగా వచ్చు. అయితే తెలుగు మాత్రం పూర్తి స్థాయిలో రాదు. అందుకే జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాలలో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంది రేష్మి.