మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని తెలుసా ?

టాలీవుడ్ లో ఇప్పటి తరం నటులలో సూపర్ స్టార్ ఎవరంటే మహేష్ బాబు చెప్పాలి. నటన,హోదా అన్ని తండ్రి దగ్గర నుండి వారసత్వంగా తీసుకుని వాటికీ న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నటన,డైలాగ్స్,డాన్స్ ,పెర్ఫామెన్స్ అనేవి మహేష్ రేంజ్ ని చెప్పేస్తాయి. తాను నటించే ప్రతి సినిమా నుండి ఏదోకటి నేర్చుకొని నిత్య విద్యార్థి వలె ఉంటాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనేది మహేష్ బాబుని చూస్తే అర్ధం అవుతుంది. ఎక్కడ అహంభావం చూపని మహేష్ ని అందరూ అభిమానిస్తారు.అయితే MISS INDIA గా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ కూడా మహేష్ లో ఈ గుణాలు నచ్చే ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంది. తనకంటే చిన్నవాడైన మహేష్ ని వదులుకోలేక పోయిందంటే సూపర్ స్టార్ లో ఉన్న ఈ సుగుణాలే.

మహేష్ కి నమ్రతలో ఉన్న వినయ విధేయతలు నచ్చాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది నమ్రత. అందుకే ఒకానొక సందర్భంలో చిరంజీవి కూడా నమ్రత వంటి అమ్మాయి తన కూతురు అయితే ఎంత బాగుండునో అని అన్నాడు. ఒక విధంగా చూస్తే మహేష్ బాబు నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి.

నమ్రత ఇంత వినయ విధేయతలతో ఉండటానికి కారణం ఆమె కుటుంబం. నమ్రత పక్కా మరాఠీ అమ్మాయి. 1972 జనవరి 22 న ముంబై లో జన్మించింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. అప్పట్లో అయన క్రికెటర్. అయన పూర్తీ పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్.

ముంబైకి ఆడే అయన దేశవాళీ క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సునీల్ గవాస్కర్,దిలీప్ వెంగసర్కార్ వంటి స్టార్ ఆటగాళ్లతో వాడేవారట. నితిన్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు అదేపనిగా టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో తోటి ఆటగాళ్లు ఆశ్చర్యపోయేవారు. అయితే నితిన్ ఆ టెలిగ్రామ్స్ ని పెద్దగా పెట్టించుకొనేవాడు కాదు. కొత్తగా పెళ్ళైన నితిన్ కి తన భార్య వనిత నుండి ఆ టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో అందరు ఆటపట్టించేవారు. నితిన్ తన కెరీర్ లో మంచి ఫాస్ట్ బౌలర్ గా ఎదిగాడు. ప్రమాదకరమైన బౌలర్ గా చెప్పుకొనేవారు. ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆ రోజుల్లోనే ఆమె పెద్ద మోడల్.

నితిన్,వనిత ప్రేమలో పడి ఆ తర్వాత ఒకటయ్యారు. నమ్రత బామ్మ మీనాక్షి శిరోద్కర్ మరాఠీ నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా సెలబ్రెటీ కుటుంబం నుండి వచ్చిన నమ్రత మొదట్లో మోడలింగ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

1993 లో MISS INDIA గా ఎంపికయి MISS యూనివర్స్ పోటీలకు సెలట్ అయింది. అయితే నమ్రత ప్రపంచ వేదికపై 5 వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అప్పటి నుండి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1998 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత.

2000 సంవత్సరంలో వంశీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో పరిచయం కావటం మరియు అది ప్రేమగా మారటం పెళ్లి జరగటం అన్ని చకచకా జరిగిపోయాయి. చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా తర్వాత ముఖానికి మేకప్ వేసుకోలేదు.

ప్రసుతం పిల్లలు గౌతమ్,సితార ఆలనా పాలనా చూసుకుంటూ, మహేష్ చేసే సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండటమే కాకుండా మహేష్ కి సంబందించిన వ్యవహారాలను కూడా చూస్తూ ఉంటుంది.

బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకోని ఆ బాధ్యతను నమ్రతకు అప్పగించి హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు బుర్రిపాలెం గ్రామాన్ని చూస్తే నమ్రత ఏ రేంజ్ లో కష్టపడిందో అర్ధం అవుతుంది.