Movies

ఈ సారి బిగ్ బాస్ 2 కి వాయిస్ చెప్తుంది ఎవరో తెలుసా?

స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ షో గురించే ప్రస్తుతం విపరీతంగా చర్చ సాగుతుంది. ఈ కార్యక్రమానికి విపరీతంగా స్పాన్సర్స్ వస్తారు. అలాగే TRP రేటింగ్ విషయంలోనూ ముందే ఉంటుంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కి రెండో సీజన్ కి చాలా మార్పులు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2 జూన్ 10 న చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. నాని హోస్టింగ్ చేస్తున్న ఈ సీజన్ లో వివిధ రంగాలకు చెందిన వారిని పార్టిసిపెంట్స్ గా తీసుకున్నారు. హోస్ట్,పార్టిసిపెంట్స్ మారిన బిగ్ బాస్ గొంతు మాత్రం రెండో సీజన్ కి మారలేదు. మొదటి సీజన్ లో ఎంత గంబీరంగా వాయిస్ వినిపించి పార్టిసిపెంట్స్ లో సీరియస్ నెస్ ని పెంచిందో ,అలాగే ఈ సీజన్ లో కూడా అదే ఫాలో అవుతుంది.

ప్రతి ఒక్కరిలో కంటికి కన్పించని బిగ్ బాస్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండటం సహజమే. అంత బేస్ వాయిస్ ఉన్న వ్యక్తి చూడటానికి కూడా అంతే గంబీరంగా ఉంటాడా అనే సందేహం చాలా మందిలో ఉన్నది.

వాస్తవానికి బిగ్ బాస్ అనే పాత్ర ఉహాజనితమైనది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ ఆలోచనలను బిగ్ బాస్ పాత్ర ద్వారా చెప్పిస్తారు. ఇక బిగ్ బాస్ లా మాట్లాడే గొంతు ఎవరది అంటే….టీవీ సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్ట్ ది అని తెలిసింది.

గతంలో టాలీవుడ్ లో రాధాకృష్ణ పరభాషా విలన్ లకు కూడా డబ్బింగ్ చెప్పారు. హిందీ బిగ్ బాస్ లో అతుల్ కపూర్ వాయిస్ ఇస్తున్నాడు. అతుల్ కపూర్ గొంతు కూడా బాగా ఫెమస్ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభానికి ముందు చాలా మందిని పరీక్షించారట.

ఆలా వందల మందిలో నుంచి రాధాకృష్ణను ఎంపిక చేసారు. పార్టిసిపెంట్స్ కి టాస్క్ లు ఇవ్వటం,ఆర్డర్స్ జారీ చేయటం,తప్పు చేస్తే పనిష్ మెంట్స్ ఇవ్వటం….ఇలా తెర వెనక ఉంటూ సీరియస్ వాతావరణాన్ని క్రియేట్ చేయటంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.