Health

“పవర్ యోగ”.. అంటే ఏమిటి..

పవర్ యోగ కు రూపకర్త అయిన బ్రయాన్ కెస్ట్, 1964 లో అమెరికా లో డెట్రాయిట్ నగరం లో జన్మించారు. ఆయన 1979 సంవత్సరం లో తన 14 వ ఏట యోగాభ్యాసం ప్రారంభించారు. మొదట హవాయి లో అష్టాంగ యోగాను అమెరికా కు పరిచయం చేసిన డేవిడ్ విలియమ్స్ వద్ద యోగాను అభ్యసించారు. తరువాత 1983 లో ఇండియా కు వచ్చి అష్టాంగ యోగ కు రూపకర్త అయిన K పట్టాభి జోయిస్ వద్ద యోగాభ్యాసం చేశారు. తరువాత గోయెంకా విపస్సనా మెడిటేషన్ కోర్స్ సాధన చేశారు. ఇలా అభ్యసించిన ధ్యానం బ్రయాన్ కెస్ట్ యోగభ్యాసం పై ప్రభావం చూపి, సాధారణ యోగ స్థాయి నుంచి మరో మెట్టు పైకి చేరేలా చేసింది, పవర్ యోగ ఆవిష్కరణ కు మార్గం సుగమం చేసింది.

అయితే ముందుగా యోగా సాధన చేసిన వారు, మరియు యోగా తత్వం తెలిసిన వారే పవర్ యోగ సాధనకు అర్హులు. ఎందుకంటే పవర్ యోగ నేర్చుకోవాలంటే శరీరం లో తగిన శక్తి ఉండాలి.

పవర్ యోగ అనేది అష్టాంగ యోగాకు మరో మెట్టు. యోగ విన్యాసాలను ఒక పద్ధతి ప్రకారం కొనసాగిస్తూ చేయాలి. ఇప్పటికే, చాలా హెల్త్ క్లబ్ లలో ఏరోబిక్స్ బదులు పవర్ యోగ ను అభ్యాసం చేయించుట మొదలైంది. ఇలా పవర్ యోగ అనేది ఏరోబిక్స్ కు ప్రత్యామ్నాయం అయింది.