భానుశ్రీ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?

బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ భామ ఐదో పార్టిసిపెంట్ గా ఎంటర్ అయింది. ఈమె టాలీవుడ్ లో దాదాపుగా 18 సినిమాల వరకు చేసింది. ఈమెను భాను త్రిపాఠి అని కూడా పిలుస్తుంటారు. ప్రముఖ ఛానల్‌లోని గోల్డ్ రష్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు భాను. ఈమె గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చిన బాహుబలి సినిమాను చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడు. ప్రభాస్, రానా లకు మంచి పేరు తెచ్చిపెట్టండి “బాహుబలి” సినిమా. దేవసేనగా “అనుష్క”, శివగామిగా “రమ్యకృష్ణ” ఆక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి.

కానీ “అవంతిక”గా చేసిన “తమన్నా” పాత్ర మాత్రం “బాహుబలి- 2 ” లో కేవలం ఒక ఫ్రేమ్ కి మాత్రమే పరిమితమయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.ఇది పక్కన పెడితే…బాహుబలి – 1 లో “అవంతిక” కు ఫ్రెండ్ గా ఓ అమ్మాయి నటించింది.

ఆమె తమన్నాకు డూప్ గా కూడా నటించింది తెలుసా. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు. సాంగ్స్ లోను తమన్నాకు డూప్ గా ఆమె చేసింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? ఆమె “భానుశ్రీ” “లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది”, “కుమారి – 21 ఎఫ్” అనే సినిమాల్లో కూడా నటించింది “భానుశ్రీ”