నిహారికతో యంగ్ హీరో పెళ్లి….. అతనికి నాగబాబు గ్రీన్ సిగ్నల్
కొన్ని రోజుల క్రితం ఒక వార్త ట్రేండింగ్ గా మారింది. అది ఏమిటంటే మెగా డాటర్ నిహారికను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త యూట్యూబ్ లో సంచలనం రేపింది. ఈ పెళ్ళికి కృష్ణంరాజు,చిరంజీవి ఒకే చెప్పారని,ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారని రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ప్రభాస్ తో కాదు యంగ్ హీరో నాగసౌర్యతో వివాహం అంటూ మరల ప్రచారం జరిగింది. ఈ పెళ్ళికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని,నాగబాబు,నిహారిక కలిసి చిరు వద్దకు వెళ్లి ఒప్పించారని త్వరలోనే వీరి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. ఆ తర్వాత ఇద్దరు కుటుంబాలు సైలెంట్ అయ్యిపోవటం, నిహారిక,నాగసూర్య వారి సినిమాలతో బిజీగా అయ్యిపోయారు.
ఇప్పుడు నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే పెళ్లి నేపధ్యం కలిగిన సినిమాను ఒప్పుకొని బిజీ అయ్యిపోయింది. యంగ్ హీరో సుమంత్ అశ్విన్,మెగా ప్రిన్సెస్ నిహారిక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్,నిహారికకు మధ్యలో జరిగే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయట.
సినిమాకి రీ రికార్డింగ్ తమన్ చేస్తుండగా , ఫిదా సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన సత్యకాంత్ పాటలను అందిస్తున్నారు. సత్యకాంత్ పాటలు,తమన్ రీ రికార్డింగ్ తో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాను అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.