Movies

లేటు వయస్సులో నగ్మా పెళ్లి…. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన బ్యూటీ నగ్మా తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ,మలయాళ భాషలలో కూడా స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించింది. సినిమాలో నగ్మా ఉందంటే సినిమా ఎంత రేటు అయినా కొనటానికి బయ్యర్లు సిద్ధంగా ఉండేవారంటే ఆమె చరిష్మా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరి సరసన జోడి కట్టింది. సుమన్ హీరోగా వచ్చిన పెద్దింటిల్లుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. కిల్లర్,ఘరానా మొగుడు,వారసుడు,మేజర్ చంద్ర కాంత్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినా రజనీకాంత్ బాషా సినిమాలో నగ్మా హీరోయిన్.

దక్షిణాదిన హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే అవకాశాలు రావు. హీరోయిన్ గా మంచి స్థితిలో ఉండుట వలన నగ్మా పెళ్లి చేసుకోవటానికి దైర్యం చేయలేదు. అప్పట్లో నగ్మా,శరత్ కుమార్ మధ్య ఎదో ఉందనే వార్తలు వినిపించేవి. శరత్ కుమార్ రాధికను వివాహాం చేసుకోవటంతో ఆ కథ అక్కడితో ముగిసింది.

అయినా నగ్మా మీద గాసిప్స్ ఏమాత్రం తగ్గలేదు. ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. దక్షిణాదిన కొత్త హీరోయిన్స్ రావటంతో తన హవా తగ్గుతుందని భావించిన నగ్మా భోజపురి చిత్ర రంగం వైపుకి వెళ్ళింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్ తరుపున యాక్టివ్ గా ప్రచారం చేస్తుంది.

తమిళనాడు కాంగ్రెస్ ఇంచార్జ్ గా కొంతకాలం వ్యవహరించింది. ఆ సమయంలో పరిచయం అయినా ఒక వ్యాపారవేత్త నగ్మా మనస్సు దోచుకున్నాడట. మలేషియా,సింగపూర్ వంటి దేశాలలో ఎన్నో పరిశ్రమలను స్థాపించిన బిజినెస్ మెన్ తో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కటానికి సిద్ధం అయినట్టు వార్తలు వస్తున్నాయి. నగ్మా పెళ్ళికి కుటంబ ప్రోత్సాహం కూడా ఉన్నట్టు సమాచారం.