ఇంట్రెస్టింగ్: ‘రానా’ కు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసా..?!

రానా దగ్గుబాటి… బాహుబలి సినిమాతో తన పేరును దశదిశలా వ్యాపింపజేసాడు. అయితే ‘రానా’ కు రానా అనే పేరు ఎలా పెట్టారో తెలుసా.. దానికి ఒక హిస్టరీ ఉందట. మొదట రానాకు సిద్దార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి. అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేశ్ బాబు తన తండ్రి పేరైన ‘రామానాయుడు’ పేరును రాసేసాడట. తాను ఎవరికీచెప్పలేదనీ. నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యా కాబట్టే పెట్టేసానని సురేష్ బాబు ఒక సందర్భంలో తెలిపారు. ఇది చూసి రామానాయుడు గారు బాగా ఆనందపడ్డారట. అయితే…

నాన్న ఫ్రెండ్ ఒకాయన‘రామానాయుడు’ అని తాను పిలవలేనని.. రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట. అలా ‘రానా’ పేరు స్థిరపడిపోయిందట. ఇదన్న మాట ‘రానా’ కు ‘రానా’ అన్న పేరు ఎందుకు పెట్టారో అన్న ప్రశ్నకు సమాధానం.

మొత్తానికి బలే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. రానా కూడా తాత గారికి తగిన విధంగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడుకి ఈ యువ హీరో పట్ల చాలా మంచి అభిప్రాయమే ఉండేదట. ఏమయినా తాత పేరు పెట్టుకున్నందుకు ఆయన పేరును నిలబెట్టేలా సినీ రంగంలో ఎదుగుతున్నాడు.