ఊహించని పనిష్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్….షాక్ లో ఇంటి సభ్యులు

బుల్లితెరమీద వస్తున్న ప్రోగ్రాం లలో మూడు టాస్క్ లు ఆరు వివాదాలుగా సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ వినోదాన్ని పంచుతోంది. వీకెండ్ లో నాని వస్తూ ఏమాత్రం జోష్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. ప్రతి వారం రోజుకో టాస్క్,అలాగే రోజూ ఓ ఫన్నీ ఎలిమెంట్ జతచేసి,బిగ్ బాస్ కార్యక్రమంపై జనాల్లో ఆసక్తి పెంచేస్తున్నారు. మంగళ, బుధ వారాల్లో చెరుకు రసం హార్ట్ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ ని చెమటోడ్చేలా చేసారు. అయితే గురువారం హౌస్ ని ఫుల్ జోష్ తో నింపుతున్నాడని అంటున్నారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో తేజస్వి, భానుశ్రీ , దీప్తి సునేలా లు తొలుత తమ డాన్సులతో ఉర్రూతలూగించారు. కెవ్వు కేక సాంగ్ తో ఊపేసారు.

అంతేకాదు రెండో పాట ప్రోమోలో అందరికీ బిగ్ బాస్ షాకిచ్చాడు. అదేమిటంటే బిగ్ బాస్ హౌస్ రూల్స్ పాటించని కారణంగా కౌశల్, తనీష్ లకు పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్.ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లో అందరూ ఎక్కువ మోతాదులో ఇంగ్లీషు మాట్లాడ్డం,నామినేషన్ల గురించి బహిరంగ చర్చ చేయడం,టాస్క్ లకు సంబంధించి అడ్డదిడ్డంగా ఆడడంతో సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ అందుకు శిక్ష వేసాడు.

సాయంత్రం బిగ్ బాస్ లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టుకుని,రూల్స్ అతిక్రమించినందుకు తొలిసారి ఇద్దరు హౌస్ మెంబర్స్ కి శిక్ష వేసాడు. కౌశల్, తనీష్ లకు పనిష్మెంట్ విధించాడు. బిగ్ బాస్ వెలుపల కార్యక్రమం నిర్వహించే సిబ్బంది తిన్న ప్లేట్స్ ని క్లిన్ చేయాల్సిన బాధ్యత కౌశల్ దేనంటూ బిగ్ బాస్ శిక్ష ఖరారు చేసాడు.

ఇక బయట ఓ పెద్ద బండరాయిని చూపించి దాన్ని చెక్కుతూ ఓ అందమైన రూపం తేవాలని తనిష్ కి పనిష్మెంట్ ఇచ్చాడు. తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు తొలిగా ఇద్దరికీ శిక్ష విధిస్తున్నామని, ముందు ముందు మిగిలిన వారికీ ఇలాంటి శిక్షలుంటాయని బిగ్ బాస్ స్పష్టంచేశాడు. అందుకే ప్రోమోలో కౌశల్ అంట్లు తోముతున్న సీన్ కనిపిస్తే, బయట తనిష్క్ బండరాయిని చెక్కుతున్న దృశ్యం దర్శనమిచ్చింది.