రిపోర్టర్ ని చెడుగుడు ఆడేసిన మెగా డాటర్… ఎందుకో తెలుసా?

మెగా ఫ్యామిలిలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పవర్ ఫుల్లే. ఇక క్రేజ్ విషయం లో కూడా మెగా ఫామిలీ అమ్మాయిలకు అదిరిపోయే క్రేజ్ సొంతం. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక తెరంగేట్రం చేసి సినిమాలలోనే కాదు, షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో కూడా హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ మెగా డాటర్ తాజాగా హ్యాపీ వెడ్డింగ్ మూవీలో నటించింది. జూన్ 30న ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. యువి క్రియేషన్స్ ,పాకెట్ బ్యానర్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీలో సమంత అశ్విన్ , నిహారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ప్రమోషన్ వీడియో లేటెస్ట్ గా వైరల్ అయింది. ఈనేపధ్యంలో ఓ రిపోర్ట్రర్ నిహారికకు ‘నీ వెడ్డింగ్ గురించి అందరూ అనుకుంటున్నారు. దాని గురించి కాస్త చెప్పండి’ అని అడిగాడు. దీంతో అతడిపై తోక తొక్కిన తాచుపాములా లేచింది. ‘అసలు నా పెళ్లి గురించి మీకు అవసరమా/ నిహారిక ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటుంది.

ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఎలా చేసుకుంటుంది?ఇది చూస్తే షాకవుతారు, అది చూస్తే షేకవుతారు. అసలు ఈ వీడియో చూస్తే కిందపడి పైకి లేస్తారు. ఇలాంటి టైటిల్స్ కోసమే కదా నాపేరు ఉపయోగించుకునేది. ఏమైనా పిచ్చా మీకు?లైక్ లు రావాలంటే నేనే దొరికానా?’అని చెడా మాడా రేవు పెట్టేసింది.

నిహారిక చెడుగుడుకి ఆ అభాగ్యుడైన రిపోర్ట్రర్ ఖంగు తిన్నాడు. వెంటనే తేరుకుని ‘ మేడం, నేను అడిగింది మీ పెళ్లి గురించి కాదండి. మీరు నటించిన హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి’ అని అన్నాడు. దీంతో నిహారిక ‘అయ్యో సారీ అండి అనవసరంగా అరిచేసా’అంటూ సినీ విశేషాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

ఈనెల 30న హ్యాపీ వెడ్డింగ్ సినీ ట్రైలర్ విడుదల చేస్తున్నామని,సినిమా విడుదల కూడా ఆరోజే ప్రకటిస్తామని నిహారిక చెప్పింది. ఇక ఈసినిమాలో సుమంత్ అశ్విన్ కి, నాకు మధ్య జరిగే ప్రతిసన్నివేశాన్ని అందరికీ ఆకట్టుకునేలా తీసారని వివరించింది. పెళ్లి కుదిరింది మొదలు, పెళ్లయ్యే వరకూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ మూవీ అని పేర్కొంది.

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి సంఘటనలుంటాయని అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని వివరించింది. ఇక ఆడియన్స్ ఈ సినిమా పాత్రల్లో తమను తాము సరిపోల్చుకుంటారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చింది మెగా వారసురాలు నిహారిక