ముఖం మీద రంద్రాలను తొలగించుకోవడానికి అద్భుతమైన పాక్స్

జిడ్డు చర్మం కలిగిన వారి ముఖం మీద రంద్రాలు చాలా పెద్దవిగా కన్పిస్తాయి. వాటి చికిత్స మరియు తగ్గించటానికి అనేక రకాల పద్దతులు ఉన్నాయి. రంద్రాలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయటానికి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంటిలో సులభంగా దొరికే సహజమైన పదార్దాలతో పెద్ద రంద్రాలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం మరియు బాదం
ఒక బౌల్ లో నీటిని పోసి దానిలో బాదం వేసి రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు నానిన బాదంను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం మరియు తెల్లసొన
గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా ఉంచటమే కాక, మృత కణాలను మరియు అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది.

దోసకాయ, నిమ్మకాయ మరియు రోజ్ వాటర్
దోసకాయను ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ముఖం మీద వేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.