మరో సంచలన నిర్ణయం తీసుకున్న రేణు…ఏమిటో తెలుసా?

ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని పైనే చర్చ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు ఒకప్పుడు టాలీవుడ్ లో ఎంతోక్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవన్ భార్యగా ఆమెను అభిమానులు గుండెల్లో గుడి కట్టి పూజించారు. పవన్ నుంచి విడిపోయి విడిగా జీవనం సాగిస్తున్నా సరే, పవన్ అభిమానులు మాత్రం ఆమెను తమ వదినమ్మగా ఆరాధిస్తున్నారు. అయితే రేణు మరోపెళ్ళి కి సిద్ధ పడడం పవన్ అభిమానులను బాగా హార్ట్ చేసిందని తెలుస్తోంది . రేణు నిర్ణయంపై నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్న ప్పటికీ, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పెళ్లి అనేది రేణు వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ పవన్ అభిమానులకు రుచించడం లేదు. అందుకే సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇటీవలే నిశ్చితార్ధం జరుపుకున్న ఫోటోలు పెట్టి సంచలనం సృష్టించిన రేణు కి పవన్ అభిమానులనుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయట.

ఫలితంగా రేణు తన ట్విట్టర్ ఎక్కౌంట్ ని డీ ఏక్టివేట్ చేసేసింది. ఇక ఇన్ స్టామ్ గ్రామ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది రేణు.కొందరు అభిమానులు సారీ వదినా అంటూ పోస్టులు పెడుతున్నారని రేణు పేర్కొంటూ తనకెందుకు సారీ చెప్పడమని ప్రశ్నించారు. హాయ్ వదినా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారని ‘వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.

త్వరలో నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి మీ అందరికి అన్నయ్య అవుతాడు. ప్రస్తుతం ఎంత సంతోషం గా ఉన్నానో ఇకమీదట కూడా అలానే వుంటాను. అకిరా, ఆద్య కూడా హ్యాపీ గానే వున్నారు. కాకపొతే కొందరు పనీ పాట లేనట్టు ,చెత్త కామెంట్స్ తో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఓ పదిశాతం ఉంటారేమో.

ప్రస్తుతం నాకు గుడ్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నాకు కాబోయే భర్త ఎవరని తెలుసుకోడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. పెళ్లయ్యాక ఆయన్ని తప్పక చూపిస్తా. అదేంటో గానీ నాకు అమ్మాయిలనుంచి కన్నా ,అబ్బాయిల నుంచే మద్దతు ఎక్కువగా లభిస్తోంది’అని వివరించింది రేణు.