రెండో పెళ్లయినా సరే…. పవన్ కావాల్సిందే అంటున్న రేణు… ఎందుకో తెలుసా?

ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ల వ్యవహారం హల్ చల్ చేస్తోంది. రకరకాల కథనాలు వినిపిస్తున్నా ,భిన్నమైన కోణాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే, టాలీవుడ్ లో ముచ్చటైన జంటగా పేరొందిన పవన్ , రేణులు పెళ్ళిచేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమికులు లేరు,మళ్ళీ రారు అనిపించుకుంది ఈ జంట. అయితే విధిరాత మరోలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అసలు సహజీవనంతో ప్రయాణం ప్రేమ ప్రయాణం ప్రారంభించి, ఆతర్వాత పెళ్లి చేసుకుని,కొన్నేళ్ళకే అందరికీ షాక్ ఇస్తూ విడిపోయారు. ఇద్దరూ విడిపోయిన దగ్గర నుంచి వీళ్లకు సంబంధించిన ఏ విషయం అయినా నెట్ లో వైరల్ అవుతూనే వుంది.

తాజాగా రేణు రెండో పెళ్లి చేసుకుంటోందన్న వార్త కూడా కొత్త చర్చకు దారితీసింది. అసలు ఈ వార్తలు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే తమ ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య ల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్న రేణు,త్వరలోనే మరో భాగస్వామితో జీవితం పంచుకోబోతోంది. నిజానికి రెండో పెళ్లి అనేది తన లైఫ్ కి ఎంతోముఖ్యమైన విషయం కనుక ఆచితూచి వ్యవహరిస్తోంది రేణు దేశాయ్.

తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పవన్ అభిమానులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఉద్దేశ్యంతో తనకు కాబోయే జీవిత భాగస్వామి ని ఇంతవరకూ పరిచయం అయినా చేయలేదు. అతను ఎవరు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు వంటి కనీస వివరాలు కూడా ఎవరికీ తెలియవు. ఈసందర్బంగా లైవ్ స్క్రీన్ ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈదశలో ఓ అభిమాని ‘పెళ్లి తర్వాత పవన్ గురించి కనీసం ఆలోచిస్తారా’అంటూ అడిగిన ఆసక్తికర ప్రశ్నకు రేణు అంతే ఆసక్తిగా బదులిచ్చింది.
“పెళ్లయినా సరే నాకు పవన్ కావాలి. ఒకప్పుడు ఇద్దరం సహజీవనం, పెళ్లి ద్వారా సుదీర్థ ప్రేమ ప్రయాణం చేసాం. నేను ఇలాంటి వ్యక్తికీ బౌతికంగా దూరం అయ్యాను తప్ప, మానసికంగా కాదు. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకున్నా సరే పవన్ తో ఎంతో అవసరం ఉంది.

నా ఇద్దరు పిల్లలకు పవన్ తండ్రి. వారి బాగోగుల కోసం పవన్ తో చర్చించి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాను. సెలవుల్లో అకిరా, ఆద్యల విషయంలో ఎలా ఉండాలి. పండగలకు,పబ్బాలకు వాళ్ళను తండ్రి దగ్గరకు ఎలా పంపాలి వంటి విషయాలు తప్ప, నాకు వేరే అషన్స్ లేవు. మరి ఇవన్నీ పవన్ సహకారం లేకుండా ఎలా జరుగుతాయి. అందుకే పవన్ అవసరం వుంది “అని రేణు స్పష్టం చేసింది.