సగ్గుబియ్యం వడలు

సాధారణంగా చాలా మంది సగ్గుబియ్యంతో పరమాన్నం చేసుకుంటారు. సగ్గుబియ్యంతో స్వీట్స్ కాకుండా హాట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సగ్గుబియ్యంతో పకోడీ,వడలు,అట్లు ఇలా చాల రకాలను తయారుచేసుకోవచ్చు. ఈ రోజు సగ్గుబియ్యం వడలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

సగ్గు బియ్యం – 2 కప్పులు
బియ్యపు పిండి – అరకప్పు
మైదా పిండి – 1 కప్పు
పచ్చిమిరప కాయలు – 8
ఉప్పు – 1 స్పూన్
బంగాళదుంపలు – 3

తయారుచేసే విధానం

సగ్గుబియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టాలి. బంగాళదుంపలను ఉడికించి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక బౌల్ లో నానబెట్టిన సగ్గుబియ్యం,పచ్చిమిర్చి ముక్కలు,బంగాళాదుంప పేస్ట్,మైదా పిండి,బియ్యంపిండి,ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరం అయితే కొంచెం నీటిని చేర్చవచ్చు.

ఆ తరవాత స్టవ్ మీద బాండి పెట్టి దానిలో నూనె పోసి వేడి అయ్యాక పై మిశ్రమాన్ని ఒక కవర్ లేదా ఒక మందపాటి పేపర్ మీద కొద్దిగా నూనె రాసి చిన్న ముద్ద తీసుకుని వడ లా గవత్తి నూనెలో వేసి గోల్డ్ కలర్ వెచ్చే వరకు వేగించాలి. అంతే వేడి వేడి ఘుమఘుమ లాడే సగ్గుబియ్యం వడలు రెడీ…..