గౌతమ్ Vs అకిరా దుమ్ము లేపే సత్తా ఎవరికి ఉందో…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరంటూ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాల్లో పలు కథనాలు ప్రచారంలో వున్నాయి. సాధారణంగా మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ అభిమానులు చేసే హడావుడి, ఒక్కోసారి సృష్టించే భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే. ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్ వగైరాలున్నారు. ఈ హీరోల్లో ఎవరి మార్కెట్ వారికుంది. స్టైల్ కూడా ఎవరిది వారికుంది. రెమ్యునరేషన్ విషయానికి వస్తే అది కూడా టాప్ రేంజ్ లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా ,తాము తీసుకునే డబ్బు కన్నా, ఏరియా హక్కులు సొంతం చేసుకోవడం ద్వారా కూడబెట్టేది ఎక్కువ.

ప్రస్తుతం ఉన్న హీరోల సంగతి పక్కన పెట్టి, భవిష్యత్ హీరోలు ఎవరు, వారి రేంజ్ ఎలా ఉంటుంది అని ఓసారి చూస్తే,హీరోల వారసులదే అగ్రస్థానం అవుతుందని చెప్పవచ్చు. ఆవిధంగా ప్రస్తుత హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా,మహేష్ బాబు తనయుడు గౌతమ్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఇటు పవన్,అటు మహేష్ బాబు ఫాన్స్ ఫాలోయింగ్ లో ఎవరికీ ఎవరు తీసిపోరు.

తన అన్న మెగా స్టార్ చిరంజీవి అండతో పవన్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ తనయునిగా మహేష్ బాబు కూడా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.ఈనేపధ్యంలో వారి వారసులు అకిరా, గౌతమ్ లు కూడా పెద్దగా కష్టపడక్కర్లేకుండానే ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకోగలరని చెప్పవచ్చు. ఫాన్స్ ఆటోమేటిక్ గా ఫాలో అయినప్పటికీ ఎక్కువగా కష్టపడితేనే స్టార్ లుగా ఎదగగలరన్నది వాస్తవం.

అయితే అకిరా, గౌతమ్ లు సినీ బ్యాక్ గ్రౌండ్ దండిగానే ఉన్నందున నటన పరంగా మెళుకువలు కూడా వస్తాయి. ఎందుకంటే అకిరా తండ్రి పవన్ అగ్ర హీరో, తల్లి రేణు దేశాయ్ కూడా టాప్ హీరోయిన్. అలాగే మహెష్ బాబు టాప్ హీరో,తల్లి నమ్రత కూడా హీరోయిన్ గా రాణించింది.
ఇప్పటికే నటన పరంగా తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ కూడా పుష్కలంగా గల అకిరా, గౌతమ్ లు ఇక సినిమాల విషయంలో ఆచితూచి సెలక్టివ్ గా వ్యవహరిస్తే సరిపోతుందని ఫాన్స్ నుంచి వినిపిస్తోంది.

ఇప్పటికే అకిరా మరాఠీ చిత్రాల్లో నటిస్తుంటే, గౌతమ్ కూడా టాలీవుడ్ లో అడపా దడపా కనిపిస్తూనే వున్నాడు. దీన్ని బట్టి ఇక మరో నాలుగైదు ఏళ్ళల్లో అకిరా, గౌతమ్ లు సినీ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని అంచనా. పవర్ స్టార్ ఫాన్స్ అండ వున్నంతకాలం అకీరాకు తిరుగుండదు. ఎందుకంటే పవన్ సినిమాలు ప్లాప్ అయినా సరే, కలెక్షన్స్ విషయంలో దుమ్ము రేపెలా చేస్తారు ఫాన్స్.

ఇక మహేష్ బాబు సినిమాలు మొదటి వారం కలెక్షన్స్ తోనే లాభాల బాట నడిపిస్తారు అభిమానులు. మరి ఇంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్,మహేష్ ల వారసులుగా అకిరా, గౌతమ్ లకు నటన అనేది కూడా వాళ్ళ రక్తంలో ఉంటుంది కాబట్టి,భవిష్యత్ ఆశాకిరణాలుగా టాలీవుడ్ ఎదురు చూస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.