యంగ్ టైగర్ ఏమి చదివాడో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు

వారసత్వ సినీ ఆరంగేట్రంలో భాగంగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన స్టామినాతో యంగ్ టైగర్ గా దూసుకొచ్చి పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్య ఇమేజ్ లను తొలిసినిమా దాకా వెంట తెచ్చుకున్నా ఆ తరవాత ఈ అభినవ తారక రాముడు స్వయం కృషితో స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యువహీరోల్లో జూనియర్ కి గల సక్సెస్ రేటు మరెవ్వరికీ లేదని చెప్పవచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, అది,యమదొంగ,తదితర చిత్రాలతో తారాపథానికి చేరి,ఆతర్వాత బృందావనం,
టెంపర్, నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్, జై లవకుశ మూవీలతో తిరుగులేని పొజిషన్ కి చేరుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఇంతటి స్థాయికి చేరడానికి అతని శ్రమతో పాటు తల్లి షాలిని కృషి కూడా ఎంతోఉంది. ఎందుకంటే మొదట్లో చాలా అల్లరిగా వుండే జూనియర్ ని క్రమశిక్షణతో పెంచింది. జీవితం పై సరైన దృక్పధం ఏర్పడేలా చేసిన ఘనత తల్లికే దక్కుతుందని జూనియర్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. నందమూరి నటవారసుడు తారక్ 1983లో జన్మించాడు.

సెలబ్రిటీ ఫ్యామిలిలో జన్మించిన తారక్ కి తొలుత తాత ఎన్టీఆర్ గారాబం చేసారు. అయితే తల్లి షాలిని శ్రద్ధ తీసుకుని ఎంతో కట్టుదిట్టంగా పెంచింది. హైదరాబాద్ విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ప్రాధమిక ఉన్నత విధ పూర్తిచేసిన ఎన్టీఆర్ ని ఇంటర్ లో చేర్పిస్తే, బయట కూడా చేసే అల్లరి భరించడం కష్టమని భావించిన, హరికష్ణ,షాలిని బాగా ఆలోచించి గుంటూరు విజ్ఞాన్ కాలేజీ హాస్టల్లో చేర్చారు.

గుంటూరులో చదువున్నా సరే తారక్ మనసంతా హైదరాబాద్ చుట్టూ, అక్కడున్న ఫ్రెండ్స్ చుట్టూ తిరగడంతో ఎలాగైనా వెనక్కి వచ్చేయాలని ప్లాన్ చేసి, చివరకు కాలు విరగగొట్టుకున్నాడు. అయినా హరికృష్ణ పట్టించుకోలేదు. అయితే జూనియర్ కూడా మొండికేయడంతో అక్కడ చదువుకి స్వస్తి చెప్పాడు. హైదరాబాద్ సెయింట్ మెరీనా కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తిచేసిన ఎన్టీఆర్, తర్వాత ఎంసెట్ కోసం ఆలోచిస్తుంటే, సినిమాల్లో హీరోగా రాణించాలని భావించి స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టేసాడు.

బ్రహ్మశ్రీ విశ్వామిత్ర ,బాలరామాయణం వంటి సినిమాల్లో రాణించిన జూనియర్, నిన్ను చూడాలని మూవీతో హీరో అయ్యాడు. అది హిట్ కాకపోయినా ఏ మాత్రం బాధపడలేదు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సెన్సేషన్ హిట్ కొట్టడంతో తారక్ క్రేజ్ అందుకుంది. ఇక ఆతర్వాత వరుస విజయాలతో దూసుకువచ్చాడు.

టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జై లవకుశ మూవీలో ఏకంగా మూడు పాత్రల్లో రాణించి ,నటవిశ్వరూపం చూపించాడు. ఇక బిగ్ బాస్ రియాల్టీ షోను ఒంటి చేత్తో నిర్వహించడం ద్వారా బుల్లితెరపై షోను సూపర్ హిట్ చేసిన ఈ నందమూరి హీరో ప్రస్తుతంమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నాడు.