ఈ సినిమాకి ఏమైంది (ఈ నగరానికి ఏమైంది ) కత్తి షాకింగ్ రివ్యూ

కొత్తగా వచ్చే యువ దర్శకులు తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో ఆతర్వాత వారి దర్శకత్వంలో వచ్చే మూవీలపై క్రేజ్ ఏర్పడుతోంది. ఆ విధంగా పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నేషనల్ లెవెల్లో ఎంతోపేరు తెచ్చుకున్నారు. ఇతడి నుంచి వస్తున్న మరో మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ ఇంట్రెస్టింగా వుంది. టైటిల్ తోనే సగం విజయం నమోదు చేసుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ఎక్కువమంది కొత్తవాళ్లే కావడంతో ఫ్రెష్ లుక్ కనిపిస్తోంది. ఇక సురేష్ మూవీస్ బ్యానర్ కావడంతో అంచనాలు ఏ రేంజ్ కి చేరుకున్నాయో చెప్పక్కర్లేదు.విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి కీలక రోల్స్ పోషించారు.

తరుణ్ భాస్కర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూపొందించిన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీ స్క్రిప్ట్ ప్రకారం ఈ మూవీ తెరపై ఎంతో అద్భుతంగా ఉంటుందని ముందుగానే అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డే సందర్బంగా ఆడియన్స్ నుంచి వస్తున్న రివ్యూస్ చూస్తుంటే,ఆ అంచనాలు నిజం అనిపిస్తోంది. ఇక టాలీవుడ్ క్రిటిక్, సంచలన వ్యక్తి కత్తి మహేష్ ఈ మూవీని తనదైన స్టైల్ లో సమీక్ష చేసారు.

ఫీల్ గుడ్ మూవీస్ గురించి మర్చిపోయిన జనానికి ఇది విందు భోజనం లాంటి మూవీ అని అభివర్ణించారు. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎన్నో చిత్రాలొచ్చినా,’ఈ నగరానికి ఏమైంది’ మూవీ చూస్తే గతంలో స్నేహాన్ని బేస్ చేసుకుని వచ్చిన మూవీలన్నీ పక్కన పెట్టేస్తారు
ఇక్కడ ఆవిషయం ఏమిటంటే ఇంతగొప్ప నిజ జీవితం అయినా సరే అది రీలుగా మారితే, అది సినీ ప్రేక్షకుల జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా కథ తన జీవితమేనని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చెప్పినా,తెరకెక్కించడంలో అతను పడ్డ శ్రమ ప్రతి సన్నివేశంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఎవరి జీవితం వారికి ఆసక్తి కరమే అయినప్పటికీ అల్టిమేట్ గా ప్రేక్షకులకు నచ్చాలి. అయితే ఈ మూవీ ఈ రెండింటీని జయంచింది. కొత్తవాళ్ళైనా సరే, విశ్వక్ సేన్,సాయి సుశాంత్,అభినవ్ అదరగొట్టారు. నిజ జీవితంలో ఫ్రెండ్స్ ఎలా ప్రవర్తిస్తారో తెరమీద అలానే అభినయించి చూపారు. ముఖ్యంగా ఈ మూవీతో అభినవ్ మంచి గుర్తింపు కొట్టేస్తాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లు అనిషా, సిమ్రాన్ చౌదరి తమ తమ పాత్రల పరిధిలో చేసిన నటన పర్వాలేదని అనిపించారు.

వివేక్ సాగర్ అందించిన సంగీతం, పాత్రలు వాళ్ళ మాటలతో పాటే ప్రయాణం చేస్తున్నాయి. ఆడియన్స్ కి ఇదో కొత్త అనుభూతి అని చెప్పవచ్చు. ఇందులో కొన్ని రష్యన్ భాషలో పాటలున్నాయి. ఇలా డిఫరెంట్ భాష అయినా సరే పాటల్లో అందంగా ఒదిగిపోయారు. నిర్మాత సురేష్ బాబు కొత్తవాళ్లపై ఎందుకు అంతగా నమ్మకం వుంచాడో సినిమా ఫస్టాఫ్ చూస్తేనే అర్ధం అవుతుంది. చాలా సినిమాలు విశ్రాంతి కి ముందు, విశ్రాంతి తర్వాత అన్న రెండు టైపులో ఉంటాయి. కానీ ఈసినిమా చూసాక ఒకే రీల్ లో సినిమా చూసిన భావన కలిగింది.

తరుణ్ భాస్కర్ కథ నడిపిన తీరుకి జై కొట్టాలి…. హేట్సాల్ఫ్ అనాలి. నికేత్ బొమ్మి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు వన్నె తెచ్చిందని చెప్పాలి. ఇంతకీ ఆల్కహాల్ కి ఎడిట్ అవ్వడం అనే పాయింట్ తీసుకుని ఇంత సెన్సిటివ్ గా కథ అల్లడం అనేది సాధారణ అంశం కాదు. ఇక నటీనటులు కొత్తవాళ్ళైనా సరే ఎంతో అనుభవం ఉన్నవాళ్ళలా నటించి మెప్పించారు. ఇక ఓవరాల్ గా చూస్తే ప్రస్తుత జనరేషన్ ఇదో అసలు సిసలైన సినిమా అని కత్తి మహేష్ తన రివ్యూతో సర్టిఫికెట్ ఇచ్చాడు.