పవన్ అభిమానులకు రేణు సీరియస్ వార్నింగ్
ఒక్కసారిగా రేణు దేశాయ్ ఇలా ఎందుకు స్పందించిందని అనుకుంటున్నారా? అవును మరి ఓపికకు హద్దు ఉంటుంది కదా . ఇంతకీ పవన్ అభిమానులపై ఆమెకు ఎందుకు కోపం చిర్రెత్తుకొచ్చిందంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అసలు పవన్ తో విడిపోయాక రేణు పూణేలో తన ఇద్దరు పిల్లలతో కల్సి ఉంటోంది. ఇక చాలారోజు పవన్ ని తలచుకుని బాధపడి డిప్రెషన్ కి గురయింది కూడా. చివరికి ఆమెకు ఓ తోడు దొరకడంతో ఇప్పుడు పెళ్ళికి సిద్దపడింది. ఆమె నిశ్చితార్ధం ఫోటోలు లీకై వైరల్ అయిన సంగతి తెల్సిందే అయితే రేణు రెండో పెళ్ళికి సిద్ధం కావడం ఇష్టం లేని కొందరు పవన్ అభిమానులు ఇన్ స్టా గ్రామ్ లో ఆమెను తిట్టిపోస్తున్నారు
పెళ్ళి చేసుకోవద్దంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇక రేణు సహించలేక పవన్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘పవన్ తో అసలు తాను ఎందుకు విడాకులు తీసుకున్నాను. విడాకులపై తాను నోరు విప్పితే అయన అభిమానుల పొగరు కాస్త మురికి కాల్వలలో కలిసిపోతుందని రేణు బాంబ్ పేల్చింది. నిజానికి విడాకుల వ్యవహారంపై తాను ఇన్నాళ్లూ మౌనంగా వున్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞత చూపాల్సి ఉందని కూడా ఆమె అనేసారు.
తాను విడాకుల గురించి అసలు విషయం చెబితే,అవివేకంతో ఉన్న కనీస మర్యాద లేని అభిమానులకు గర్వభంగం కలుగుతుందని రేణు తీవ్రస్థాయిలో మండిపడింది. గురువారం ఇన్ స్టా గ్రామ్ లో ఈమేరకు రేణు ఓ ప్రకటన విడుదల చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈవిధంగా తనను వేధిస్తున్న అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాదు తన ఇన్ స్టా గ్రామ్ లోప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్ అభిమానులకు అస్సలు లేదని ఆమె చురకలంటించారు. అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే దుష్ట ప్రచారాన్ని తాను ఎందుకు భరించాలని ఆమె సీరియస్ గా ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తాను మౌనంగానే ఉన్నానని, ఇంకా తనను డిస్టర్బ్ చేస్తే,తాను పవన్ తో ఎందుకు విడాకులు తీసుకున్నానో, దానివెనుక ఏం జరిగిందో తేటతెల్లం చేస్తానని ఘాటుగా హెచ్చరించింది.
ఇకనుంచి నా బతుకు నన్ను బతకనీయండి. నా పనితనం గురించి కామెంట్స్ చదువుకునే రోజు నా సోషల్ మీడియాలో రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’ అంటూ రేణు ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.