పుదీనాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

పుదీనాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి పుదీనా వాసన నచ్చదు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పకుండా పుదీనాను తినటం ప్రారంభిస్తారు. మన పూర్వికుల కాలం నుండి పుదీనాను వాడుతున్నారు. అయితే పుదీనాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మైగ్రైన్ మరియు టెన్షన్ తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా నూనెను రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే తగ్గుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను నలిపి వాసన చుసిన మంచి ఫలితం కనపడుతుంది.

పుదీనా నూనెను ఒంటికి రాసుకొని కాస్త ఆరాక గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒంటి నొప్పులు అన్ని మాయం అయ్యిపోతాయి.

కొన్ని పుదినా ఆకులను మెత్తగా చేసి చాతీ మీద రుద్దాలి. అంతేకాకుండా పుదినా ఆవిరిని పీల్చినా దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలనుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

పుదీనా ఆకులను తరచుగా నమలడం వలన చిగుళ్లు బలంగా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

పుదీనా ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.