బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన సామ్రాట్ భార్య హర్షిత

కొన్ని సార్లు నటనే జీవితం. మరికొన్ని సార్లు జీవితమే నటన. ఇక చాలామంది నటీనటుల వ్యక్తిగత జీవితాలు భలే ఉంటాయి. టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో రాణించి, కొన్ని లీడింగ్ రోల్స్ కూడా చేసిన సామ్రాట్ ప్రస్తుతం బిగ్ బాస్ షో లో తేజస్వితో రొమాంటిక్ నడుపుతున్నాడు చూడ్డానికి అందంగా ఆరడుగులుండే సామ్రాట్ పంచాక్షరీ లో అనుష్కతో కల్సి లీడింగ్ రోల్ చేసాడు. అయితే వైవాహిక జీవితంలో ఏర్పడ్డ ఇబ్బందులతో ఉన్నట్టుండి కొంతకాలం తెరమరుగైన సామ్రాట్ ఇప్పుడు బిగ్ బాస్ లో కనిపిస్తున్నాడు. తన భార్య అన్నిరకాలుగా ఆనందంగా చూసుకుంటుందని పెళ్లి చేసుకున్న సామ్రాట్ కి ఇబ్బందులెదురయ్యాయి.

అయితే భార్యతో పాటు అత్తింటి వాళ్ళు కూడా కట్న కానుకలు తదితర కారణాలతో వేధింపు లకు పాల్పడుతున్నాడని నిజానికి సామ్రాట్ అనుకున్నంత మంచోడు కాదని ఎన్ని కేసులు పెట్టాలో అన్నీ పెట్టారు. దీంతో సామ్రాట్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇలా సామ్రాట్ నుంచి విడిపోడానికి అతని భార్య అన్ని ప్రయత్నాలు చేయడంతో ప్రస్తుతం ఇద్దరూ విడిగానే వుంటున్నారు.

అయితే తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోడానికి ఏ కోర్టుకైనా వస్తానని సామ్రాట్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని పక్కన తనకున్న ఇమేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన సామ్రాట్ తనదైన రొమాంటిక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. తేజస్వితో లవ్ ట్రాక్ ఆసక్తికరంగా నడుపుతున్నాడు.
అయితే ఇది నిజమా కదా అన్నది మనకు అర్ధం అవుతుంది.

ఎవరి టీమ్ లో వాళ్ళు ఉన్నా, చుట్టుపక్కల ఎవరు చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా సామ్రాట్, తేజు చాలా టైం పాస్ చేస్తూ ,ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటావు లోకాన్ని మైమరచి పోయినట్టు ఉంటారు. కానీ సామ్రాట్ ని కాదని విడిగా ఉంటున్న భార్య మాత్రం దీన్ని గమనిస్తూ, బిగ్ బాస్ లోని రొమాంటిక్ పై తన ఒపీనియన్ షేర్ చేసుకుంటూ షేక్ ఇచ్చింది.

‘నేనెలాగూ పొసపోయా. ఇప్పుడు తేజస్వి మోసపోతుంది. సో తేజస్వికి నా ప్రగాఢ సానుభూతి’అంటూ సెటైర్ విసిరింది నిజానికి సామ్రాట్ అంత అమాయకుడు కాదని,అతడి వలన నష్టపోయిన తనకే అన్ని తెలుసనీ, అందుకే తనలా ఏ అమ్మాయి మోసపోరాదని ఆమె పేర్కొంటూ సామ్రాట్ కి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది.

సామ్రాట్ తో దూరంగా ఉంటున్నా ఇంకా ఎందుకు అతని గురించి ఆమె ఆలోచిస్తోందన్నది అర్ధం కాని ప్రశ్న. ఇక బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ , తేజు నిజంగా లవ్ ట్రాక్ లో పడ్డారా, గేమ్ ఆడుతున్నారా అనేది వాళ్ళద్దిరికీ మినహా, బిగ్ బాస్ కే కాదు మనకి కూడా ఎప్పటికీ అర్ధం కాదు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో కొంచెం ఆసక్తిగా ఉందంటే, సామ్రాట్ , తేజుల మధ్య నడిచే రొమాంటిక్ కారణం.

అయితే సామ్రాట్ వైఫ్ కి ఇదేమి తెలీక కంగారు పడుతోందా, నిజంగా వాళ్లిద్దరూ లవ్ లో మునిగిపోయారా, బిగ్ బాస్ ఆడించే గేమా, భవిష్యత్తులో ఎటైనా దారితీస్తుందా అనే విషయాలు తేలాలంటే వేచి ఉండక తప్పదు మరి.