Movies

విప్లవ హీరో,దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ లో ఆర్. నారాయణ మూర్తి పేరు చెప్పగానే విప్లవ సినిమాలు, సామాజిక ఇతివృత్తం గల సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు 19 సినిమాలను నిర్మించి దర్శకత్వం వచ్చిన ఈయన 25 బయట సినిమాల్లో నటించారు. ఈయన పేరు చెబితే చాలు ఓ విప్లవ సేనాని, ఉద్యమ కారుడు స్పురిస్తాడు. ఎర్ర సైన్యం, చీమలదండు లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు అందించిన ఈయన మావోయిస్టుల పుట్టుక, ఉద్యమం గురించి చాటి చెప్పారు. అయితే ఈయన గురించి సినీ జనాలకు తెల్సింది చాలా తక్కువనే చెప్పాలి. విప్లవ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన ఈయన ఆ తర్వాత ప్రేక్షకుల అభిరుచి చేంజ్ అవ్వడంతో కనుమరుగయ్యారు. ఇప్పటికే 64 ఏళ్ళు వచ్చినా పెళ్లి ఊసెత్తని నారాయణమూర్తి అందుకు కారణం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.

నారాయణ మూర్తి 1953లో తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపూడి గ్రామంలో ఓ పేద రైతు రెడ్డి చిన్నయ్య నాయుడు, చిట్టెమ్మ దంపతులకు జన్మించారు. రౌతుల పూడిలో 5వ తరగతి వరకూ చదివిన ఈయనకు సినిమాలాంటే ఇష్టం. రౌతులపూడిలో గల సినిమా థియేటర్ లో సినిమాలు చూస్తూ,విరామ సమయంలో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లను అనుకరించేవారు.

ఆవిధంగా తన నటనా జీవితానికి పునాది వేసుకున్నాడు. శంఖవరం పాఠశాలలో చదివేటప్పుడు సామాజిక స్పృహ కలిగింది. సామాన్య జనానికి జరిగే అన్యాయం గుర్తించి విప్లవ సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. పెద్దాపురం కాలేజీలో చేరిన ఈయన విద్యార్థి సమస్యలపై అవగాహన ఏర్పరచుకున్నాడు. విద్యార్థి సంఘ నేతగా,హాస్టల్ విద్యార్థి సంఘ నాయకునిగా, కళాశాల లలితా కళల విభాగం కార్యదర్శిగా ఎదిగాడు.

అక్కడ రాజకీయాలకు ప్రభావితుడై సినిమాలు , రాజకీయాలు,బాధ్యత వంటి అంశాలపై వ్యాసంగం ఏర్పరచుకున్నాడు. హాస్టల్లో పెదవిద్యార్థి నిధి సంఘం స్థాపించిన ఈయన దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించి జైలుకి వెళ్లారు. సామాజిక అంశాలపై చిత్రాలు తీయాలని భావించి సినీ పిచ్చితో 1972లో మద్రాసు వెళ్లి, అవకాశాలకోసం తిరిగాడు.

ఆ సమయంలో అక్కడక్కడా తింటూ, లేని రోజుల్లో పస్తులుంటూ, చెట్టుకింద పడుకునేవాడు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ దాసరి నారాయణరావుతో ఏర్పడ్డ పరిచయంతో సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేరము శిక్ష సినిమాలో చిన్నపాత్రను దక్కించుకున్నాడు. పైగా అది ఓ పాటలో 175మంది జూనియర్ ఆర్టిస్టుల్లో ఈయన ఒకరన్నమాట. ఆతర్వాత అలాగే చిన్నచిన్న వేషాలకు పరిమితమైన నారాయణ మూర్తికి మళ్ళీ డాక్టర్ దాసరి తాను రమేష్ బాబు హీరోగా తీస్తున్న నీడ మూవీలో అవకాశం ఇచ్చారు.

ఆ చిత్రంలో పోషించిన పాత్రకు అవార్డు వచ్చింది. సినిమా కూడా హిట్ కొట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అవకాశాలు దక్కించుకున్న ఈయన విప్లవ సినిమాలతో ఓ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని,తనదైన ముద్ర వేశారు. అదే సమయంలో తానే నిర్మాతగా మారి తీసిన అర్ధరాత్రి స్వాతంత్య్రం గ్రాండ్ హిట్ అయింది. నిర్మాతగా,దర్శకునిగా ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో సామాజిక ఇతివృత్తం గల చిత్రాలు తీశారు.

ఎర్ర సైన్యం సినిమా బిగ్ హిట్ అయింది. చీమలదండు లాంటి మావోయిస్టుల ప్రాధాన్యత గల చిత్రాలు చేసారు. 2009 వరకూ ఈయన హీరోగా నటించిన 26 సినిమాల్లో 10 హిట్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాలకు దూరంగా వున్నారు. ఇక ఈయనకు టిడిపి రెండుసార్లు కాకినాడ ఎంపీ సీటు,ఒకసారి కాంగ్రెస్ తుని అసెంబ్లీ సీటు ఆఫర్ చేసినా సరే సున్నితంగా తిరస్కరించారు.

మరి 60 ప్లస్ లో కూడా ఆయన పెళ్లి అంశానికి దూరంగానే ఉన్నారు. సమాజ సేవకు అడ్డువస్తుందని ఆయన పెళ్లి చేసుకోలేదు సొంత ఇల్లు కూడా లేని నారాయణ మూర్తి జూబ్లీ హిల్స్ లో ఆటోలో తిరుగుతూ సాధారణ జీవనం సాగిస్తున్నారు.