Beauty Tips

జిడ్డు చర్మం ఉన్నవారికి అరటిపండు పేస్ స్క్రబ్

జిడ్డు చర్మం కలవారు మేకప్ చేసుకున్న కొంతసేపటికే జిడ్డుగా మారిపోతుంది. జిడ్డు సమస్యను వదిలించుకోవడానికి అరటిపండు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అరటిపండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా సహాయాపడుతుంది. ఇప్పుడు అరటిపండు,పాలు,ఓట్ మీల్ ఉపయోగించి స్క్రబ్ తయారుచేసుకుందాం.

అరటిపండులో పొటాషియం మరియు విటమిన్ A, B, E వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన చర్మంలో జిడ్డును సమర్థవంతంగా తొలగించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. పాలు సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మానికి పోషణ,తేమను అందిస్తుంది. ఈ స్క్రబ్ చర్మ ఎక్స్ ఫ్లోట్,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తొలగించటానికి సహాయం చేస్తుంది.

బాగా పండిన ఒక అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక స్పూన్ పాలు, రెండు స్పూన్ల ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు వృత్తాకార కదలికలతో మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.