స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

స్వీట్ కార్న్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. మలబద్దకం వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. మధుమెహం ఉన్నవారు కూడా హ్యాపీగా తినవచ్చు. స్వీట్ కార్న్ లో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి, సంతృప్త కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. అందువల్ల మొక్కజొన్న తినటం వలన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది.

స్వీట్ కార్న్ లో యాంటాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్యప్రక్రియను ఆలస్యం చేసి చర్మం యవన్నంగా ఉండేలా చేస్తుంది.

దీనిలో ఫోలేట్ సమృద్ధిగా ఉండుట వలన దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయటమే కాకుండా కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

దీనిలో విటమిన్ E కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన మొటిమలను తగ్గిస్తుంది. మొటిమల పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

స్వీట్ కార్న్ లో విటమిన్ సి, లైకోపీన్ కంటెంట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలకుండా బలంగా పెరిగేలా చేస్తుంది.